మనీ: రైతులకు శుభవార్త .. ఈ పంటతో రూ.3 లక్షలకు పైగా ఆదాయం..!

Divya
ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు వివిధ కొత్త ప్రయోగాలతో వ్యవసాయం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. మీరు కూడా వ్యవసాయంలో ఏదైనా విభిన్నంగా చేయడం ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించాలనుకుంటే ఈరోజు మేము మీకు వ్యాపార ఆలోచనలు అందిస్తున్నాం. దీని ద్వారా మీరు నెలకు రూ.3 నుండి రూ. 6 లక్షల రూపాయలు పొందవచ్చు. ప్రస్తుతం చాలామంది విద్యావంతులు కూడా వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే వ్యవసాయం పద్ధతిగా కొత్త ప్రయోగాలతో చేసినట్లయితే ఈ వ్యాపారంలో రూ. లక్షలు సంపాదించవచ్చు. ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన అనేక సౌకర్యాలను కూడా అందిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సుగంధ ద్రవ్యమైన కుంకుమపువ్వు కేవలం ఒక కిలో మిమ్మల్ని లక్షణాధికారి చేస్తుందని చెప్పవచ్చు.

దీన్ని బంగారంతో సమానంగా చూస్తారు. అయితే కుంకుమపువ్వు ఎక్కువగా మన దేశంలో కాశ్మీర్,  అంతర్జాతీయంగా ఆఫ్గానిస్థాన్ లోని పర్వత ప్రాంతాల్లోనే ఎక్కువగా పండిస్తారు. ఇక్కడి నేలలు కుంకుమపువ్వు పంటకు అనుకూలంగా ఉంటాయి.  అయితే కుంకుమపువ్వు పొడినేలలో ఎక్కువగా పండించవచ్చు. ఇందుకోసం ఇసుకతో కూడిన పొడి నేలలు చాలా అనుకూలమైనవి.  అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీకు ఇటువంటి పరిస్థితులు కల్పిస్తే కుంకుమపువ్వును పెద్ద మొత్తంలో పండించే వీలు ఉంటుంది. కుంకుమ పువ్వులు పండే కొద్ది స్థలంలోని లక్షల్లో సంపాదించవచ్చు . దీనిని రెడ్ గోల్డ్ అని పిలుస్తూ ఉంటారు.
ప్రస్తుతం భారతదేశంలో రూ.2.5 లక్షల నుండి రూ.3 లక్షల కిలో ధర పలుకుతోంది.  ఉల్లిపాయ తరహా పంట ఇది. ఆన్లైన్లో మీకు విత్తనాలు లభిస్తాయి.. జూలై మధ్య కాలం నుండి కూడా కుంకుమ పువ్వు పంటకు మంచి సమయం గా పరిగణించబడుతుంది. మైదాన ప్రాంతాల కోసం కుంకుమపువ్వు విత్తనాలను ఫిబ్రవరి మార్చి మధ్య విత్తుతారు. గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా, రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లలో కూడా కుంకుమపువ్వు సాగు పెద్ద ఎత్తున జరుగుతోంది. కుంకుమ సాగుకు తగిన సూర్యకాంతి అవసరం అవుతుంది. సముద్రం మట్టానికి 2500 మీటర్ల ఎత్తులో కుంకుమపువ్వు సాగు చేయవచ్చు. చలి,  వర్షాకాలం ప్రాంతాలలో ఈ పువ్వు సాగు చేయలేము. కాబట్టి వాతావరణం వెచ్చగా ఉన్నచోట ఈసాగు చేయవచ్చు. ఈ పంట తో లక్షల్లో ఆదాయం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: