మనీ: ఇన్కమ్ టాక్స్ అధికారులు.. జప్తు చేసిన డబ్బు, ఆస్తులు ఏం చేస్తారో తెలుసా..?

Divya
ఇటీవల కాలంలో ఇన్కమ్ టాక్స్ రైడ్ లో భారీగా డబ్బు, ఆస్తి పట్టుబడినట్లు నిత్యం అనేక వార్తలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఒక్కసారిగా ఇంత డబ్బు , నగలు చూసేసరికి సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు.. సాధారణంగా ఎవరి దగ్గరైనా సరే అక్రమ ఆదాయం ఉన్నట్టు అనుమానం వస్తే చాలు ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెంటనే దాడులు చేస్తారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కోర్టు ముందు నిలబెడతారు. ఒకవేళ కోర్టులో నేరం రుజువైతే వారు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.
అయితే ఇదంతా ఓకే కానీ రైడ్ లో దొరికిన డబ్బు,  నగలు అన్నింటిని ఇన్కమ్ టాక్స్ అధికారులు ఏం చేస్తారు? ఎక్కడ పెడతారు? అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా.. ఒకవేళ వస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చదివి తెలుసుకుందాం..
రాజస్థాన్ లోని జైపూర్ కి  చెందిన ఆదాయపు పన్ను శాఖ రిటైర్డ్ అధికారి ఒకరు తమ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.  అసలు జప్తు చేసిన డబ్బును ఏం చేస్తారు అనే విషయాలను వివరించడం జరిగింది.. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఇలా జప్తు చేసిన ఆస్తులను ఏం చేస్తారు అనే విషయానికి వస్తే ముఖ్యంగా అధికారులు జప్తు చేసిన సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఇక ఇందులో కమిషనర్ కు కమిషనర్ కు లింకు చేసిన అకౌంటు లు ఉంటాయి. ఇక ఆ అకౌంట్లో సీజ్ చేసిన సొమ్మును డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మొత్తం ఆదాయం, ఆస్తి వివరాలను చెక్ చేస్తారు .. ప్రభుత్వానికి రావలసిన టాక్స్ ఎంత వాటి వివరాలను నిర్ధారించుకొని టాక్స్ డబ్బులు మినహా మిగతా సొమ్మును తిరిగి ఎవరి దగ్గర అయితే డబ్బు ఆస్తులు తీసుకొని జప్తు చేశారో.. తిరిగి వారికే మిగతా సొమ్మును చెల్లించడం జరుగుతుంది. అందుకే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డప్పుడు మీ దగ్గర ఎంత ఆస్తి ఉందనే విషయానికి నిజాయితీగా టాక్స్ కట్టినట్లయితే ఇటువంటి ఆరోపణలు మీపై రావు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: