మనీ: తక్కువ పెట్టుబడితో కోటీశ్వరులు అయ్యి ఛాన్సే..!!

Divya
సామాన్యుల నుండి వ్యాపారవేత్తల వరకూ అందరూ కూడా ఎక్కువగా పెట్టుబడుల విషయంలో lic ని విశ్వసిస్తూ ఉంటారు. బ్యాంకులతో పోల్చితే ఎల్ఐసి లో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం వల్ల వడ్డీతో అధిక లాభం లభిస్తుంది. అంతేకాకుండా డబ్బు పోతుందనే భయం కూడా ఉండదు. ఎల్ఐసి కి సంబంధించి వివిధ పాలసీలలో పెట్టుబడులు పెట్టినప్పుడు చాలామందికి ఎల్ఐసి పాలసీల గురించి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. అయితే ఎల్ఐసి పథకంలో డబ్బును డిపాజిట్ చేయడం వల్ల కోటి రూపాయల వరకు లాభం పొందవచ్చు.
పెట్టుబడి కాలం చాలా తక్కువగానే ఉంటుంది కేవలం నాలుగు సంవత్సరాలకి పెట్టుబడి పెట్టినట్లయితే కోటి రూపాయల వరకు లాభం వస్తుంది. lic పాలసీలో ఉత్తమమైన ప్లాన్లలో ఒకటి జీవన్ శిరోమణి పథకం. ఈ పథకం అతి తక్కువ పెట్టుబడితో లక్షాధికారులను అయ్యేలా చేస్తుంది. ఈ పాలసీని డిసెంబర్ 19 2017 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. ఈ పాలసీ కింద పెట్టుబడిదారులు నాలుగు సంవత్సరాలలో కోటి రూపాయల వరకు పొందవచ్చు. ఇది నాన్ లింక్డ్ పరిమితి ప్రీమియం చెల్లింపు మరియు మనీ బ్యాంకు పథకం కింద వర్తిస్తుంది.

ఈ పథకం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి కూడా రక్షణ లాగా ఉంటుంది. జీవన్ శిరోమణి పథకంలో పెట్టుబడిదారులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. ఈ స్కీమ్ లో వార్షిక , త్రైమాసికంగా, నెలసరి వాయిదాలలో కూడా చెల్లించుకోవచ్చు. ఈ పాలసీని అప్లై చేయడానికి 18 సంవత్సరాల వయసు ఉండాలి. ఈ పాలసీ కాల పరిమితి..14,16,18,20 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ ప్రీమియం నాలుగు సంవత్సరాలు మాత్రమే చెల్లించాలి. అలా నాలుగు సంవత్సరాలు చెల్లించి ఇక 10 సంవత్సరాలు మీరు చెల్లించకుండా మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాత ఏకంగా కోటి రూపాయలను మీరు సొంతం చేసుకోవచ్చు ఇక ఎల్ఐసి అందిస్తున్న ఈ అద్భుతమైన పథకంలో మీరు కూడా పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: