హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఎల్బీనగర్‌లో జంపింగ్ ఎమ్మెల్యే పొజిషన్ ఏంటి?
ఇక 2009లో వైఎస్సార్ సపోర్ట్‌తో ఎల్బీనగర్ సీటు వచ్చింది...అలాగే తొలిసారి విజయం కూడా సాధించారు. అలా సుధీర్ రెడ్డి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే అయ్యారు...తెలంగాణ రాష్ట్రం వచ్చాక అంటే 2014 ఎన్నికల్లో కూడా సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు...అయితే టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్ కృష్ణయ్య చేతిలో ఓడిపోయారు. అప్పుడు కూడా కాంగ్రెస్‌ని వదలకుండా పనిచేశారు.
2018 ముందస్తు ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎల్బీనగర్‌లో టీఆర్ఎస్‌పై విజయం సాధించారు. కాకపోతే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తు సుధీర్‌కు బాగా కలిసొచ్చింది..ఎల్బీనగర్‌లో ఉండే టీడీపీ మద్ధతుదారులు సుధీర్‌కు సపోర్ట్ చేశారు...దీంతో సుధీర్ ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన వెంటనే సుధీర్...అధికార టీఆర్ఎస్‌లోకి జంప్ కొట్టేశారు...అలాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా ఎల్బీనగర్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు...నగర పరిధిలో ఉండటంతో అభివృద్ధి వేగంగా జరుగుతుంది..అయితే చిన్నాచితక సమస్యలు ఉన్నాయి...డ్రైనేజ్, తాగునీటి సమస్యలు ఉన్నాయి..అలాగే పలు కాలనీల్లో అంతర్గత రోడ్లు సరిగ్గా లేవు..ఇక వరదలు వస్తే మునిగిపోయే పరిస్తితి ఉంది.
రాజకీయంగా చూస్తే ఎల్బీనగర్‌లో సుధీర్ స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నారు..కాకపోతే ఇక్కడ కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉంది..అటు బీజేపీ కూడా బలపడుతుంది. అయితే నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్ధి దిగితే సుధీర్ రెడ్డికి కాస్త ఇబ్బంది అవుతుంది.