హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: భద్రాచలంలో హస్తం ఎమ్మెల్యేకు తిరుగులేదా?

రెండోసారి తెలంగాణలో అధికారంలోకి కేసీఆర్..ఇతర పార్టీల ఎమ్మెల్యేలని ఏ విధంగా లాగేశారో అందరికీ తెలిసిందే. మొదటిసారి గెలిచినప్పుడే చాలామంది ఎమ్మెల్యేలని లాగేశారు. ఇక రెండోసారి గెలిచాక మరింత మందిని టీఆర్ఎస్‌లోకి లాగారు. కాంగ్రెస్ తరుపున 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 12 మంది ఎమ్మెల్యేలని టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చేశారు. అలాగే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలని లాగేశారు.
అయితే ఎన్ని ప్రలోభాలు పెట్టిన కొందరు ఎమ్మెల్యేలు లొంగలేదు. అలా లొంగని ఎమ్మెల్యేల్లో పోడెం వీరయ్య కూడా ఒకరు. మొదట నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వీరయ్య...తొలిసారి 1999 ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 2004 ఎన్నికల్లో మరొకసారి సత్తా చాటారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసిన సీతక్క చేతిలో వీరయ్య ఓడిపోయారు.
ఇక 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత చందులాల్ చేతిలో వీరయ్య ఓడిపోయారు. అయితే సీతక్క టీడీపీని వదిలి కాంగ్రెస్‌లోకి రావడంతో...2018లో ములుగు సీటు సీతక్కకు ఇచ్చారు. దీంతో వీరయ్య ములుగు వదిలి భద్రాచలం రావాల్సి వచ్చింది. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న భద్రాచలంలో కాంగ్రెస్ తరుపున బరిలో దిగి వీరయ్య విజయం సాధించారు. ఇక టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన కూడా వీరయ్య పార్టీ మారలేదు. కాంగ్రెస్‌లోనే ఉంటూ పోరాడుతున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటంతో నిధులు సరిగ్గా అందడం లేదు. అయినా సరే ప్రజలకు అండగా ఉంటున్నారు. ముఖ్యంగా గిరిజనులకు సపోర్ట్‌గా ఉంటూ పోడు భూముల సమస్యలపై పోరాడుతున్నారు.
ఇక భద్రాచలంలో వీరయ్యకు చెక్ పెట్టాలని టీఆర్ఎస్ గట్టిగానే ట్రై చేస్తుంది. టీఆర్ఎస్ నేత తెల్లం వెంకటరావు పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అయితే వీరయ్య స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల వెంకటరావు బలం సరిపోవడం లేదు. ఒకవేళ నెక్స్ట్ టీఆర్ఎస్‌తో గాని కమ్యూనిస్టులు కలిస్తే వీరయ్యకు కాస్త ఇబ్బంది అవుతుంది. భద్రాచలంలో బీజేపీకి బలం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: