హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కంచర్లకు కోమటిరెడ్డి చెక్ పెట్టగలరా?

నల్గొండ రాజకీయాలు అని టాపిక్ మాట్లాడితే..ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడాల్సిందే. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తావన తీసుకురావాల్సింది. ఇప్పుడు నల్గొండ అసెంబ్లీ స్థానం టీఆర్ఎస్ చేతుల్లో ఉన్నా సరే...కోమటిరెడ్డి టాపిక్ తీసుకురాకుండా ఉండటం కష్టం. అంటే అంతలా నల్గొండ అసెంబ్లీపై కోమటిరెడ్డి తన ముద్ర వేశారని చెప్పొచ్చు. ఇక యూత్ కాంగ్రెస్ నుంచే పనిచేస్తూ వస్తున్న కోమటిరెడ్డి..టీడీపీ వేవ్‌కు సైతం ఎదురు నిలబడి 1999 ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇదే కోమటిరెడ్డి మొదటి విజయం.
ఇక ఆ తర్వాత 2004, 2009 2014 ఎన్నికల్లో వరుసగా నల్గొండ గడ్డపై కోమటిరెడ్డి గెలుస్తూనే వచ్చారు. కానీ 2018 ఎన్నికల్లోనే కోమటిరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డిపై టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇక తొలిసారి ఎమ్మెల్యే అయిన కంచర్ల...దూకుడుగానే పనిచేసుకుంటూ వెళుతున్నారు. ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు...సంక్షేమ పథకాలు అమలు బాగానే చేస్తున్నారు.


అయితే ఇక్కడ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ రైతులు ఇప్పుడు సమస్యల్లో ఉన్నారు. ఇక్కడ వరి పంట ఎక్కువ పండిస్తారు. పైగా పారా బాయిల్డ్ రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. కానీ వేసవిలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం తేల్చేసింది. ఇటు రాష్ట్రం కూడా వరి వేయొద్దని చెప్పేసింది. దీంతో వరి పంటపై ఆధారపడ్డ రైతులు ఇబ్బంది పడే పరిస్తితి. అలాగే నల్గొండని ఫ్లోరైడ్ సమస్య ఇప్పటికీ వదిలిపెట్టలేదు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం రక్షిత మంచినీటిని పూర్తి స్థాయిలో అందించలేకపోతుంది.    
రాజకీయంగా చూస్తే కంచర్ల కాస్త బలపడ్డారు. కానీ నల్గొండ కోమటిరెడ్డి అడ్డా...ఇప్పటికే ఆయనపై ఓడిపోయిన సానుభూతి..ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్నా సరే నెక్స్ట్ ఎన్నికల్లో నల్గొండ నుంచే పోటీ చేస్తారు. ఇక్కడ బీజేపీకి పట్టు లేదు. పోటీ మొత్తం కాంగ్రెస్-టీఆర్ఎస్‌ల మధ్యే. మరి ఈ సారి కంచర్లకు కోమటిరెడ్డి చెక్ పెట్టగలరేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: