హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అంజాద్‌కు అంతా జగన్ దయే..!

కడప అంటేనే జగన్ అడ్డా..ఇక ఇక్కడ వైసీపీ తప్ప మరొక పార్టీ గెలుస్తుందని ఊహించడం కూడా అతిశయోక్తే అవుతుంది. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలవడం అసాధ్యమని చెప్పాల్సిన పని లేదు...ముఖ్యంగా కడప అసెంబ్లీ స్థానం...ఇది మైనారిటీల అడ్డా. ఇక్కడ వారిదే పైచేయి. ఏ పార్టీ అయినా సరే మైనారిటీ నాయకులే బరిలో దిగాలి. గెలుపు కూడా వారిదే. 1994 నుంచి కడప అసెంబ్లీలో అదే పరిస్తితి...1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఖలీల్ బాషా గెలిస్తే...2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున అహమదుల్లా గెలిచారు.
2014, 2019 ఎన్నికల్లో అంజాద్ బాషా వైసీపీ తరుపున విజయం సాధించారు. ఇప్పుడు అంజాద్ బాషా మైనారిటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. మరి డిప్యూటీ సీఎంగా అంజాద్ అదరగొడుతున్నారా? అంటే అబ్బే అదేం లేదని సొంత వర్గమైన మైనారిటీలే చెప్పే పరిస్తితి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఆయన మంత్రి అని, డిప్యూటీ సీఎం హోదా కూడా ఉందని చాలామందికి తెలియని పరిస్తితి ఉందని కూడా అంటున్నారు.
ఈ రెండున్నర ఏళ్లలో అంజాద్ బాషా డిప్యూటీ సీఎం అని ఎంతమంది ప్రజలకు తెలుసని అడిగితే..మంత్రివర్గంలో అంజాద్ అనే మంత్రి కూడా ఉన్నారా? అని ఆశ్చర్యపోయే పరిస్తితి ఉంటుంది. సరే మంత్రిగా పక్కనబెడితే...ఎమ్మెల్యేగా కడప అసెంబ్లీకి ఎలాంటి సేవలు చేస్తున్నారు? అంటే పర్లేదులే ప్రభుత్వం తరుపున అందే సంక్షేమ పథకాలని సజావుగా అందేలా చేస్తున్నారు.
అలాగే కడపలో కొత్తగా వార్డు సచివాలయాలు...వాటర్ ట్యాంకులు, సి‌సి రోడ్లు, రైతు బజార్లు లాంటివి నిర్మాణం జరిగాయి. అయితే పలు చోట్ల రోడ్లు ఉన్నాయో లేక గుంతలు ఉన్నాయో తెలియని పరిస్తితి. తాగునీటికి బాగా ఇబ్బందులు ఉన్నాయి. నగరంలో డ్రైనేజ్ సమస్యలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో అంజాద్‌కు యావరేజ్ మార్కులు పడుతున్నాయి....మొత్తం మీద కూడా యావరేజ్ మార్కులే పడుతున్నాయి. కాకపోతే ఇక్కడ గెలుపు అంతా జగన్ దయే...జగన్ ఉన్నారు కాబట్టి కడపలో వైసీపీ గెలుపు ఆగదు...ఇక్కడ టీడీపీకి గెలుపు గగనం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: