హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఫాల్గుణ దూకుడు...టీడీపీకి మళ్ళీ డిపాజిట్ కష్టమే...!

ఏపీలో ఉన్న గిరిజన ప్రాంతాలు వైసీపీకి కంచుకోటలుగా ఉన్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్రలో ఉన్న గిరిజన నియోజకవర్గాల్లో వైసీపీకి ఎదురులేకుండా పోతుంది. ముఖ్యంగా అరకు అసెంబ్లీ స్థానంలో వైసీపీ దూసుకెళుతుంది. గత రెండు పర్యాయాలు నుంచి అరకులో వైసీపీనే విజయం సాధిస్తూ వస్తుంది. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. టీడీపీ తరుపున పోటీ చేసిన మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు.
ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్ధి  రెండో స్థానంలో నిలిచారు. అయితే భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన చెట్టి ఫాల్గుణ అరకులో దూసుకెళుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గంలోని ప్రజల మధ్యలోనే ఉంటూ వస్తున్నారు. గిరిజన ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలని ఆధునికత వైపు నడిపించేందుకు కష్టపడుతున్నారు.
నియోజకవర్గంలో మెరుగైన వసతులు సమకూరేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రులు, రోడ్లు, సురక్షితమైన తాగునీరు లాంటి సౌకర్యాలు ఉండవు. ఇప్పుడు ఎమ్మెల్యే తక్షణ కర్తవ్యంగా అరకు ప్రజలకు సరైన వసతులు అందించడానికి చూస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో రోడ్లు వేయించడం, రవాణా సౌకర్యం కల్పించడం, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేయించడం లాంటివి చేస్తున్నారు. అటు నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటివరకు గుడిసెల్లో నివశిస్తున్న గిరిజనులకు, జగనన్న కాలనీల పేరిట ఇళ్ళు కట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 100 శాతం గిరిజనులకే ఉద్యోగాలు దక్కేలా కృషి చేస్తున్నారు.
ఇలా అన్నీ రకాలుగా ఫాల్గుణ అరకులో ముందుకెళుతున్నారు. ఇక్కడ టీడీపీ తరుపున మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ పెద్దగా యాక్టివ్‌గా లేరు. అలాగే టీడీపీ పరిస్తితి కూడా సరిగ్గా లేదు. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా అరకులో టీడీపీకి డిపాజిట్ దక్కడం కష్టమే అని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: