హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: శింగనమలలో పద్మావతిదే పైచేయి...

ఓటమి వచ్చిందని క్రుంగిపోకుండా పోరాడితే మంచి ఫలితం వస్తుందని నిరూపించిన నాయకురాలు జొన్నలగడ్డ పద్మావతి. పోస్ట్ గ్రాడ్యుషన్ చేసిన పద్మావతి 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున శింగనమల నుంచి పోటీ చేసి 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఓటమి పాలైన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వచ్చారు. సాగునీటి  సాధనకు నియోజకవర్గంలో పాదయాత్ర, పింఛన్‌దారులకు న్యాయం చేయాలని తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు చేశారు.  

ఈ పోరాటాల ఫలితంగా 2019 ఎన్నికల్లో పద్మావతికి భారీ విజయం దక్కింది. టీడీపీ అభ్యర్ధి బండారు శ్రావణిపై 46 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రావణి తనదైన శైలిలో నియోజకవర్గంలో పనిచేసుకుని వెళుతున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రతిరోజూ నియోజకవర్గంలో ఏదొక గ్రామంలో పర్యటిస్తూ ప్రజలని పలకరిస్తున్నారు.

అసలు పార్టీల పరంగా చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నారు. కొత్తగా సి‌సి రోడ్లు, డ్రైనేజ్, సచివాలయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఇక పద్మావతికి ధీటుగా టీడీపీ అభ్యర్ధి శ్రావణి క్రేజ్ కూడా అలాగే పనిచేస్తున్నారు. ఆమె దారుణంగా ఓడిపోయినా సరే ప్రజలకు అండగానే ఉంటున్నారు.  ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాటం చేస్తున్నారు. అటు కార్యకర్తలని కలుపుకునిపోతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. కాకపోతే ఎన్నికలై ఏడాది దాటిన కూడా నియోజకవర్గంలో పద్మావతి బలం పెద్దగా తగ్గినట్లు కనిపించడం లేదు.

ఎందుకంటే రాజకీయంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఎప్పుడు ప్రజల్లో ఉండటం వల్ల పద్మావతి బలం తగ్గలేదు. అయితే నియోజకవర్గంలో ఉన్న కీలకమైన సమస్యలకు చెక్ పెడితే పద్మావతికి తిరుగుండదు. పైగా శింగనమలలో వైసీపీకి బలమైన కేడర్ ఉంది. కాబట్టి నియోజకవర్గంలో ప్రస్తుతానికైతే పద్మావతిదే పైచేయి అని చెప్పొచ్చు. కాకపోతే ఏ సమయంలోనైనా శ్రావణి మంచి పోటీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: