హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: గంటా ఎమ్మెల్యేగా ఉన్నారా?
తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక రాష్ట్ర విభజనతో గంటా 2014 ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి, ఆ ఎన్నికల్లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, చంద్రబాబు కేబినెట్‌లో పనిచేశారు. ఐదేళ్లు అధికారం అనుభవించిన గంటా, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచే విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచారు.
కానీ గెలిచిన దగ్గర నుంచి గంటా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. టీడీపీలో అసలు యాక్టివ్‌గా లేరు. దీంతో ఆయన ఒకసారి వైసీపీలోకి, మరోసారి బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ గంటా మాత్రం ఎటు వెళ్లలేదు. అయితే ఈ మధ్య మాత్రం గంటా వైసీపీలోకి వెళ్ళడం ఫిక్స్ అని వార్తలు వచ్చాయి. అలా అని ఆయన పార్టీ మారింది లేదు. అటు టీడీపీ కూడా గంటాని పట్టించుకోవడం మానేసింది.
ఇక విశాఖ నార్త్ ప్రజలు కూడా గంటా ఎమ్మెల్యే అన్న సంగతి మరిచిపోయినట్లే ఉన్నారు. ఎమ్మెల్యేగా గంటా నార్త్‌లో ఒక్కపని చేయడం లేదు. అసలు అక్కడ సమస్యలని పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే వైసీపీ ఇన్‌చార్జ్ కేకే రాజు మాత్రం నార్త్ ప్రజలకు అండగా ఉంటున్నారు. అక్కస సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పథకాలు అందిస్తున్నారు. రోడ్లు, తాగునీటి సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు. పైగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానుండటం నార్త్ నియోజకవర్గంలో అభివృద్ధి మరింత జరగనుంది. మొత్తానికైతే ఎమ్మెల్యేగా గెలిచిన గంటా నార్త్ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో, వైసీపీ నేత కేకే రాజు అన్నీ తానై చూసుకుంటున్నారు.