హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కొత్త ఎమ్మెల్యే కొత్తగా చేసిందేంటి?

కడప జిల్లాలో అన్నీ నియోజకవర్గాలు వైఎస్సార్‌సీపీకి కంచుకోటలుగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కడపలోని 10 సీట్లలో వైఎస్సార్‌సీపీ హవానే నడిచింది. మొత్తం 10 సీట్లు వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే పడ్డాయి. ఒక్కో నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో గెలిచారు. అలా భారీ మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాల్లో బద్వేలు కూడా ఒకటి. ఇక్కడ డాక్టర్ జి. వెంకట సుబ్బయ్య తొలిసారి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి రాజశేఖర్‌పై 44 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. స్వతహాగా డాక్టర్ అయిన సుబ్బయ్య...సాధారణ కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు.

 

తర్వాత వైఎస్సార్‌సీపీలోకి వచ్చి 2016లో బద్వేలు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో బద్వేలు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కేవలం జగన్ వేవ్‌లోనే సుబ్బయ్య అదిరిపోయే విజయం సొంతం చేసుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బయ్య..బద్వేలు ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. నిత్యం ఏదొక గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అటు ప్రభుత్వ పథకాలని అందించడంలో ఎలాంటి లోటు చేయడం లేదు. అయితే నియోజకవర్గంలో అభివృద్ధి పెద్దగా జరగడం లేదు. కొత్తగా ఎమ్మెల్యే అయిన సుబ్బయ్య...నియోజకవర్గంలో కొత్తగా చేసిన పనులు ఏమి లేవు.

 

నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. ఎప్పటిలాగానే బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోవడం లేదు. చాలా గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవు. అటు పార్టీల పరంగా చూసుకుంటే బద్వేలులో వైఎస్సార్‌సీపీకి తిరుగులేదు. ఇక్కడ ప్రజలు ఎప్పుడు వైఎస్సార్ ఫ్యామిలీ ఆదరిస్తూనే ఉంటారు. అందుకే తొలిసారి పోటీ చేసిన సుబ్బయ్యని కూడా భారీ మెజారిటీతో గెలిపించారు. ఇక టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాజశేఖర్ అడ్రెస్ లేరు. ఇక్కడ టీడీపీ కేడర్ కూడా యాక్టివ్‌గా లేదు. భవిష్యత్‌లో కూడా టీడీపీ తరుపున వేరే నాయకుడు వచ్చిన కూడా ఇక్కడ వైఎస్సార్‌సీపీకి చెక్ పెట్టడం సాధ్యం కాదు. మొత్తానికైతే బద్వేలులో వైఎస్సార్‌సీపీ నుంచి ఎవరు పోటీకి దిగినా కూడా అదిరిపోయే విజయం సొంతం చేసుకోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: