హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తలసాని తగ్గేదేలే!

తలసాని శ్రీనివాస్ యాదవ్...ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కరలేదనే చెప్పాలి...రెండు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు సుపరిచితమే..అలాగే తెలంగాణ రాజకీయాల్లో తలసాని ఒక తిరుగులేని నేత. దశాబ్దాల కాలం నుంచి హైదరాబాద్ లో రాజకీయం నడిపిస్తున్న నాయకుడు..ఇలా తిరుగులేని నాయకుడుగా ఉన్న తలసాని రాజకీయ జీవితం మొదలైంది టీడీపీలోనే సంగతి అందరికీ తెలిసిందే. కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చిన తలసాని 1994 ఎన్నికల్లో తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ సీటులో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆ తర్వాత 1999 ఎన్నికల్లో కూడా అక్కడ నుంచే పోటీ చేసి గెలిచారు..ఇక 2004 ఎన్నికల్లో తలసాని అనూహ్యంగా ఓడిపోయారు...అయితే 2008 ఉపఎన్నికల్లో తలసాని పోటీ చేసి మళ్ళీ గెలిచారు...ఇక 2009 ఎన్నికల్లో తలసాని మరొకసారి ఓటమి పాలయ్యారు. అయితే సికింద్రాబాద్ కంటే సనత్ నగర్ బెస్ట్ అని చెప్పి 2014 ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
కానీ టీడీపీ శాసనసభాపక్ష నేతగా తలసానికి అవకాశం రాకపోవడంతో..దశాబ్దాల పాటుగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని తెంపుకుని తలసాని టీఆర్ఎస్ లో చేరిపోయారు..అలాగే కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఇలా మంత్రిగా తనదైన శైలిలో రాజకీయం చేస్తూ తలసాని బలమైన నాయకుడుగా ఎదిగారు..ఇక 2018 ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి...టీడీపీపై 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇలా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తలసానికి మరొకసారి మంత్రి అయ్యే అవకాశం వచ్చింది...మళ్ళీ కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు.
మంత్రిగా తలసాని దూసుకెళుతున్నారు..అలాగే సనత్ నగర్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక రాజకీయంగా తలసానికి తిరుగులేదు...ఇక్కడ టీడీపీ పూర్తిగా కనుమరుగైంది..అయితే కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఉన్నారు...కాకపోతే ఈయన రాజకీయంగా బలంగా కనిపించడం లేదు. ఇక్కడ బీజేపీ నిదానంగా పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల సమయానికి ఇంకా పుంజుకుంటే ఓకే లేదంటే సనత్ నగర్లో తలసాని విజయం ఆపడం కష్టమవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: