హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వివేకానందకు చెక్ పెట్టేది ఎవరు?

తెలంగాణ రాజకీయాల్లో కాస్త ఫాలోయింగ్ ఉన్న యువ నేతల్లో కేపీ వివేకానంద గౌడ్ ఒకరని చెప్పొచ్చు..రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడుగా ఉన్న వివేకానంద..ఇంజినీరింగ్ చేసి..తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక 2009 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల బరిలో దిగారు..టీఆర్ఎస్ తరుపున కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేశారు. అయితే అప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కూన శ్రీశైలం గౌడ్ చేతిలో వివేకానంద ఓడిపోయారు.
ఇక తర్వాత టీడీపీలోకి వచ్చిన వివేకా...2014 ఎన్నికల్లో అదే కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు..ఏపీ ప్రజలు ఎక్కువ ఉండటంతో కుత్బుల్లాపూర్‌లో వివేకా విజయం సాధించారు..అయితే రాను రాను తెలంగాణలో టీడీపీ కనుమరుగు కావడంతో..ఆయన 2016లో టీడీపీని వదిలి..టీఆర్ఎస్‌లో చేరిపోయారు..ఇక రెండేళ్ల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన వివేకా..2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మరొకసారి కుత్బుల్లాపూర్‌లో విజయం సాధించారు. ఇలా రెండు సార్లు వివేకా ఎమ్మెల్యేగా గెలిచారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వివేకా తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు...కుత్బుల్లాపూర్ ప్రజలకు ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటారు....నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగానే చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీ ఏరియా కావడంతో కుత్బుల్లాపూర్‌లో కాలుష్యం సమస్య ఎక్కువ...అలాగే తాగునీటి ఇబ్బందులు కూడా ఉన్నాయి..అదేవిధంగా కొన్ని కాలనీల్లో డ్రైనేజ్ సమస్య కూడా ఎక్కువే...కొన్ని చోట్ల అంతర్గత రోడ్లు సౌకర్యం అంతంత మాత్రమే. కాకపోతే నియోజకవర్గం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది.


రాజకీయంగా చూసుకుంటే ఇక్కడ టీడీపీ కనుమరుగు కావడంతో, ఆ పార్టీ క్యాడర్ అంతా టీఆర్ఎస్ వైపుకు వచ్చేసింది..అదే వివేకాకు బాగా ప్లస్ అవుతుంది..ఇక్కడ కాంగ్రెస్ మొన్నటివరకు బలంగానే ఉండేది..కానీ శ్రీశైలం గౌడ్ బీజేపీలోకి వెళ్ళడంతో, ఆ పార్టీ పికప్ అవుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్‌లో బీజేపీ నుంచి శ్రీశైలం గౌడ్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ నుంచి అభ్యర్ధి క్లారిటీ రాలేదు. అయితే రాజకీయంగా ఇక్కడ వివేకాదే కాస్త పైచేయిగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: