హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు మళ్ళీ ఛాన్స్ ఉందా?

గత రెండు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌లో జంపింగ్ నేతలే ఎక్కువ ఉన్నారని చెప్పొచ్చు...ఆ పార్టీ సగం మందిపైనే టీడీపీ నుంచి వచ్చిన వారు ఉండగా, ఇంకా కాంగ్రెస్..ఇతర పార్టీల నుంచి నేతలు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు..2014లో గెలిచి అధికారంలోకి వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు.
ఇక 2018 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. అలా టీఆర్ఎస్ చేరిన జంపింగ్ ఎమ్మెల్యేల్లో పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఒకరు. అమెరికా పైలట్‌గా శిక్షణ తీసుకుని, అక్కడ ఉద్యోగం చేయకుండా, తెలంగాణకు వచ్చేసి 2009 ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరారు. ఆ పార్టీ అభ్యర్ధిగా 2009 ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.


ఇక రోహిత్ రెడ్డి...2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్‌లో చేరారు...ఆ పార్టీలో చేరి తాండూరు టిక్కెట్ ఆశించారు..కానీ అప్పటికే టీడీపీ నుంచి మహేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లోకి వచ్చారు. దీంతో సీనియర్ నాయకుడుగా ఉన్న మహేందర్ రెడ్డికి తాండూరు సీటు దక్కింది. అలాగే తాండూరులో మహేందర్ రెడ్డి మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తర్వాత తాండూరులో మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డిలకు పెద్దగా పడేది కాదు...ఇదే క్రమంలో రోహిత్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి మహేందర్...రోహిత్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు.
దీంతో రోహిత్ కాంగ్రెస్‌లో చేరి 2018లో తాండూరు నుంచి పోటీ చేసి మహేందర్ రెడ్డిపై గెలిచారు. మళ్ళీ గెలిచాక ఆయన కాంగ్రెస్‌ని వదిలి టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. అధికార పార్టీలోకి వెళ్ళాక అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేసుకుంటున్నారు...కాకపోతే మళ్ళీ మహేందర్ రెడ్డితో పడటం లేదు. దీంతో రోహిత్‌కు రాజకీయంగా ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయి. అయితే మహేందర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు..దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో తాండూరు టీఆర్ఎస్ టిక్కెట్ రోహిత్‌కే దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.  కాకపోతే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు బలపడుతున్నాయి..పైగా మహేందర్ రెడ్డి వర్గం వ్యతిరేకంగా ఉంది..ఈ పరిస్తితుల్లో రోహిత్‌కు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: