హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కారు ఎమ్మెల్యే సీటు డౌటేనా?

వచ్చే ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు దక్కడం కష్టమని ఇప్పటికే టీఆర్ఎస్ వర్గాల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పలువురు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్న నేపథ్యంలో...వారికి మళ్ళీ సీటు ఇస్తే గెలవడం కష్టమని, అందుకే వారిని సైడ్ చేసి వేరే నేతలకు సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో నర్సాపూర్ అసెంబ్లీలో టీఆర్ఎస్ సీటు మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చిలుముల మదన్ రెడ్డి ఉన్నారు..ఈయన రాజకీయ జీవితం టీడీపీ మొదలైంది..2004లో టీడీపీ నుంచి పోటీ చేసి నర్సాపూర్‌లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. ఇక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల్లో నర్సాపూర్‌లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు..2018 ఎన్నికల్లో కూడా మరొకసారి సత్తా చాటారు. ఇలా వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ రెడ్డి..తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతూ...నర్సాపూర్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
అయితే నియోజకవర్గంలో అనుకున్న మేర అభివృద్ధి పనులు చేయలేకపోతున్నారు..నర్సాపూర్ మున్సిపాలిటీలో ఎప్పటికప్పుడు అభివృద్ధి పనుల శంఖుస్థాపనలు జరుగుతున్నాయి గాని...పనులు మాత్రం పూర్తి కావడం లేదు. సీసీరోడ్లు, మురికికాల్వల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. మార్కెట్‌ భవనం, మున్సిపల్‌ కార్యాలయం, డంప్‌యార్డు, శ్మశానవాటిక, మినీస్టేడియం, కమ్యునిటీహళ్ళకు నిధులు మంజూరైన సరే పనులు జరగలేదు. ఇక పనులు పూర్తి అయినా సరే నర్సాపూర్ ఆర్టీసీ డిపో ప్రారంభం కాలేదు. అటు రూరల్‌లో కూడా అభివృద్ధి పెద్దగా లేదు. నర్సాపూర్‌ నియోజకవర్గం పేరుకే డివిజన్‌ కేంద్రం...కానీ దానికి తగ్గటు నర్సాపూర్ ఉండదు.
రాజకీయంగా చూస్తే...నర్సాపూర్ టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు నడుస్తోంది...కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ..వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ట్రై చేస్తున్నారు. అటు సునీతా టీఆర్ఎస్‌లోకి వచ్చేశాక నర్సాపూర్‌ కాంగ్రెస్‌లో బలమైన నాయకుడు లేకుండా పోయారు...ఇక్కడ బీజేపీకి పెద్దగా బలం కనిపించడం లేదు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో నర్సాపూర్ టీఆర్ఎస్ టిక్కెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: