హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యాదగిరి హ్యాట్రిక్‌కు పొన్నాల బ్రేక్?

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత పొన్నాల లక్షయ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు....పొన్నాల అంటే తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దశాబ్దాల కాలం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వస్తున్నారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే కాంగ్రెస్ పార్టీలోనే పయనం కొనసాగిస్తున్నారు. ఇక జనగాం నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పి‌సి‌సి అధ్యక్షుడుగా పనిచేశారు.
అయితే తెలంగాణ వచ్చాక పొన్నాలకు కాలం కలిసి రావడం లేదు...వరుసపెట్టి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేతిలో ఓడిపోతున్నారు. ఇక ముత్తిరెడ్డి అదే కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు...కాకపోతే కాంగ్రెస్‌లో టిక్కెట్ దొరక్కపోవడంతో 2009లో టీఆర్ఎస్‌లో చేరి, ఉప్పల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో జనగాం బరిలో దిగి పొన్నాలపై గెలిచారు. ఇలా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తిరెడ్డి తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. జనగాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.
అయితే ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై పలు భూ కబ్జాల ఆరోపణలు వస్తున్నాయి..ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ముత్తిరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎమ్మెల్యేకు కాస్త మైనస్ అవుతున్నాయి...ఇక వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండటంతో కాస్త సహజంగానే ప్రజా వ్యతిరేకత పెరిగింది..అటు వరుసగా ఓడిపోతున్న పొన్నాలపై సానుభూతి ఉంది. కాకపోతే జనగాం కాంగ్రెస్‌లో లుకలుకలు ఉన్నాయి. జనగాం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న జంగా రాఘవరెడ్డికి, పొన్నాలకు పెద్దగా పడని పరిస్తితి. ఇరువురు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
ఎన్నికల నాటికి ఈ ఆధిపత్య పోరు సర్దుకుంటే పర్లేదు...లేదంటే పొన్నాల మళ్ళీ డేంజర్ జోన్‌లో పడినట్లే. అయితే ఇక్కడ బీజేపీకి పెద్ద బలం లేదు. కాకపోతే రాష్ట్రంలో ఆ పార్టీ మంచి ఊపు ఉంది...కాబట్టి జనగాంలో కూడా బీజేపీ బలపడే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ప్రధాన ఫైట్ టీఆర్ఎస్-కాంగ్రెస్‌లే మధ్యే ఉంటుంది. మరి చూడాలి ఈ సారి యాదగిరి హ్యాట్రిక్ కొట్టకుండా పొన్నాల ఆపుతారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: