హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: గండ్రకు గండ్ర చెక్ పెట్టగలరా?

ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం అంటే..కాంగ్రెస్‌కు కంచుకోట అని చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్‌కు మంచి బలం ఉంది. అయితే ఆ బలం గండ్ర వెంకటరమణారెడ్డి రూపంలో టీఆర్ఎస్ వైపుకు వెళ్లిపోయిందనే చెప్పొచ్చు. అసలు అనేక ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేస్తూ వస్తున్న గండ్ర..కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ పనిచేశారు. అలాగే 2009 ఎన్నికల్లో భూపాలపల్లి సీటు దక్కడం, ఆయన గెలవడం జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో..చీఫ్ విప్‌గా కూడా పనిచేశారు.
అయితే 2014 ఎన్నికల్లో గండ్ర..కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మధుసూదనాచారి విజయం సాధించారు. కానీ 2018 ముందస్తు ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది.. మధుసూదనాచారిపై గండ్ర విజయం సాధించారు. కాకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో, గండ్ర రూట్ మార్చేశారు...కాంగ్రెస్‌ని వదిలి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేగా గండ్ర బాగానే పనిచేసుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, భూపాలపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. గండ్ర దంపతులు నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ, వారి సమస్యలని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు.
ఇక నియోజకవర్గంలో ఇంకా బోలెడు సమస్యలు ఉన్నాయి..భూపాలపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజ్ ఇష్యూ స్థానిక ప్రజలని ఇబ్బంది పెడుతుంది. డ్రైనేజ్‌లు పూడిపోయి మురుగునీరు నిలిచిపోయి భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పలు కాలనీల్లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి...ఇక తాగునీరు సమస్య యథావిధిగానే ఉంది. రూరల్ ప్రాంతంలో కూడా ఇదే సమస్య.
రాజకీయంగా వస్తే..భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయణని బరిలో దించారు. భూపాలపల్లిలో సత్యనారాయణకు కూడా బలం ఉంది. వచ్చే ఎన్నికల్లో గండ్ర వర్సెస్ గండ్రగా ఫైట్ నడవనుంది. ఇక మధుసూదనాచారికి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి..ఆయనకు సీటు దక్కే అవకాశాలు లేవు. ఇక్కడ బీజేపీ అనుకున్నంత బలం లేదు. అంటే భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర సత్యనారాయణల మధ్య పోరు జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: