హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కారు ఎమ్మెల్యే ఈ సారి అస్సామే..!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం..గతంలో టీడీపీ కంచుకోట..ఇప్పుడు టీఆర్ఎస్ అడ్డా. 1983 నుంచి ఇక్కడ టీడీపీ మంచి విజయాలు సాధించింది. 1983, 1985లో టీడీపీ గెలవగా, 1989లో కాంగ్రెస్ గెలిచింది. ఇక 1994, 1999ల్లో మళ్ళీ టీడీపీ సత్తా చాటింది. 2004లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2009లో అచ్చంపేటలో టీడీపీ విజయం సాధించింది. అయితే రాష్ట్ర విభజన జరిగాక పరిస్తితి మారింది. తెలంగాణ వచ్చాక 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ తరుపున గువ్వల బాలరాజు విజయం సాధించారు.
ఇలా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల...ప్రజల మెప్పు పొందేలా పనిచేస్తున్నారా? అంటే ఏమో డౌట్ అనే చెప్పాలి. గువ్వల రెండు పర్యాయాలు కూడా ప్రజల మెప్పు పొందేలా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఎమ్మెల్యేగా సొంత పనులు చేసుకోవడంలో ఉన్న ఆసక్తి..ప్రజలకు పనులు చేసి పెట్టడంలో లేదనే చెప్పాలి. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి అంతంత మాత్రమే. సంక్షేమ పథకాలు మాత్రం ప్లస్ అవుతున్నాయి.
ఒకప్పుడు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న గువ్వల...ఇప్పుడు ఆర్ధికంగా మాత్రం బాగా బలపడ్డారని టాక్. ఇక గువ్వల వివాదాల్లో కూడా ఎక్కువగా ఉంటున్నారు. ఆ మధ్య హుజూరాబాద్‌లో ఈటలని ఓడిస్తామని లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చేతులు కాల్చుకున్నారు. అలాగే పోలీసులతో వాగ్వాదం పెట్టుకుని హైలైట్ అయ్యారు.
ఇక సాగునీరు, తాగునీరు సమస్యలు పూర్తిగా తీరలేదు. అలాగే ఇక్కడ గిరిజనుల జీవితాల్లో పెద్దగా మార్పులు రాలేదు. ఎమ్మెల్యే జీవితంలో మాత్రం భారీ మార్పులే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా గువ్వల ఎక్కువ ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ అధిష్టానం సైతం గువ్వల పనితీరుపై అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ తరుపున వంశీకృష్ణ పనిచేస్తున్నారు. వరుసగా ఓడిపోతూ వస్తున్న వంశీ...ఈ సారి గువ్వలకు చెక్ పెట్టి అచ్చంపేటలో సత్తా చాటాలని చూస్తున్నారు. ఇక్కడ బీజేపీకి పెద్ద బలం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: