హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కొడంగల్‌లో కారుని షేక్ చేస్తున్న రేవంత్..!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం...అసలు ఈ నియోజకవర్గం పేరు గతంలో పెద్దగా హైలైట్ అయిన సందర్భాలు లేవు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిచారో అప్పటినుంచి కొడంగల్ పేరు బయటకు రావడం మొదలైంది. టీడీపీలో ఉండగా ఫైర్ బ్రాండ్ నాయకుడుగా ఉన్న రేవంత్..2009, 2014 ఎన్నికల్లో వరుసగా కొడంగల్ నుంచి గెలిచి సత్తా చాటారు. రేవంత్ ప్రభావంతో కొడంగల్ బాగా హైలైట్ అయింది.
ఇక అంతకంటే ముందు ఇక్కడ టీడీపీ మంచి విజయాలే సాధించింది. అలాగే కాంగ్రెస్ కూడా పలుమార్లు సత్తా చాటింది. అయితే రేవంత్ అనూహ్య పరిణమాల మధ్య టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరి...2018లో కొడంగల్ బరిలో దిగారు. ఎలాగో బలం ఉంది కాబట్టి రేవంత్ గెలుపు ఈజీ అని అంతా అనుకున్నారు. కానీ అధికార టీఆర్ఎస్..రేవంత్‌ని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో కూడా కొడంగల్ ప్రజలకు బాగా తెలుసు. రాజకీయంగా ప్రతి అంశాన్ని వాడుకుని..చివరికి రేవంత్‌కు చెక్ పెట్టింది. ఇక టీఆర్ఎస్ తరుపున పట్నం నరేందర్ రెడ్డి గెలిచారు.


ఇలా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నరేందర్...కొడంగల్‌కు ఏమన్నా చేస్తున్నారా? అంటే ఈ మూడేళ్లలో కొడంగల్‌లో చేసిన అభివృద్ధి శూన్యం...ఏదో సంక్షేమ పథకాలు మాత్రం అందిస్తున్నారు. పైగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలని పెద్దగా అమలు చేయలేదు. అలాగే ఇక్కడ మైనింగ్ మాఫియా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జాలకు అడ్డు అదుపు లేదనే విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా కొడంగల్ రాజకీయ కక్షసాధింపు చర్యలకు వేదిక అయిందని టాక్. వచ్చే ఎన్నికల్లో గానీ కొడంగల్ సీటు మళ్ళీ నరేందర్‌కు ఇస్తే ఈ సారి కారు రివర్స్ అవ్వక తప్పదని తెలుస్తోంది. ఈ సారి రేవంత్..కారుకు గట్టి షాక్ ఇచ్చేలా ఉన్నారు. కొడంగల్‌లో మరొకసారి రేవంత్ సత్తా చాటడం ఖాయమని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: