శివరాత్రి స్పెషల్ ఫీచర్: కాకతీయుల "వేయి స్థంబాల గుడి"



భారతదేశం చరిత్ర దేవాలయాల్లో శిల్పాల్లో ఉన్నంత గొప్పగా చరిత్రకారులు రాసిన చారిత్రక రచనల్లో లేదు. సంపూర్ణంగా ఒక ఖండం లేదా కాంటినెంట్ లక్షణాలను సంతరించుకున్న గొప్ప భారత ఉప ఖండానికి చారిత్రక రచనలు సంపూర్ణంగా లేక పోవటం, ఒక లోపమైతే దాన్ని సమతుల్యం చేస్తూ అనేక కళా ఖండాలు, శిలలు, కుడ్యాలపై చెక్కిన శాసనాలు, ప్రతిమలు, దేవాలయాలు వాటిపై బొమ్మలు కొంత ఉపశమనం కలిగిస్తూ ఉన్నాయి. మన చరిత్ర ఆధారాలు గా మన పురాణాలు, ఉపనిషత్తులు, వేదవాజ్ఙయం, కొన్ని సహస్రాబ్ధాలుగా వస్తున్న ఇతర రచనలను చరిత్రగా   భావించవలసి వస్తుంది.




విదేశీ చరిత్రకారులు మార్కోపోలో, ఫాహియాన్ లాంటి వాళ్ళు రాసినప్పటి వారిదేశ చరిత్రలో ఉటంకించిన విషయాల నుండే భారత చరిత్రక ఆధారాలు దొరుకుతున్నాయి. ఆ పరిమాణం సముద్రమంత భారత చరిత్రలో ఒక నీటి బిందువు అంత మాత్రమే. మిగతా చరిత్రంతా శిలలు, శిల్పాలు, డేవాలయాలు, శాసనాలు పురాణాల నుండి మాత్రమే ఊహించినది కొంత యదార్ధం కొంత మిళితమైనదే. 




వేయిస్థంబాలగుడి  ఒకచారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన హిందూదేవాలయం ఆలయం, ఇక్కడ విష్ణువు, శివుడు మరియు సూర్యుడు మొదలైన ముగ్గురు దేవతలు ఉన్నారు. కొలువై ఉన్న త్రికూటాలయం. వేయి స్తంభాల దేవాలయ సముదాయాన్ని క్రీ.శ. 1163 లో కాకతీయ రాజు ఒకటవ రుద్రదేవుడు నిర్మించాడని చెప్పే శాసనం లభించింది. 3 ఏ.డి. లో  ఈ దేవాలయ నిర్మాణానికి అత్యంత గొప్పదైన చాళుక్య శిల్పకళా సైలిని అనుసరిస్తూ నూతన కకతీయ శిల్పకళా చాతుర్యాన్ని జోడించి ఒక దివ్యమైన శైలిలో చెక్కబడిన వెయ్యి స్థంబాలను ఉపయోగించారు. అందుకే దీనికి వేయి స్థంబాల గుడి అనే పేరు వొచ్చింది.




ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే చరిత్ర లోనికి ప్రవేసిస్తూ మహోన్నతమైన ఉద్వేగానికి లోనవుతాం. సోపానాల నుండి కుడ్యాల వరకు పీఠం నుండి గోపురం వరకు ఏ ప్రదేశాన్ని చూసినా మన మనసు అహ్లాదానికి గురై ప్రాణం లేచివస్తుంది. కుడ్యాల మీద తీర్చిదిద్దిన శిల్పాలు దివ్యలోక అనుభూతిని మనకు అనుభవం లోకి తెచ్చి ఏదో దెవలోకంలో లోనో ఇంద్ర సభలోనో అడుగు పెట్టిన భావన కలిగిస్తాయి.




ఈ గుడిలో మనసును ఆకర్షించి ఆకట్టుకునే ద్వారాలు, తలుపులు, పైన పేర్కొన్న వేయి స్తంభాలు మరియు శిల్పకళతో ఉన్న ఆలయ పైకప్పులు-మొదలైన వాటితో ఓరుగల్లు శిలప చాతుర్యమంతా మితుమిట్లు గొలిపే సౌదర్యంతో వరంగల్ యొక్క సందర్శన స్థలాలో ఒక ప్రముఖ యాత్రాస్థలిగా నిలిచింది. పేరు లోనే స్పష్టమౌతున్నట్లు ఇది వేయి స్థంబాల తో నిర్మితమైన దేవాలయం. అయితే, వేయి స్థంబాలను గణించడం కష్టమైన పనే. కొన్ని విడిగా, ప్రత్యేకం గా కనిపించినప్పటికీ అనేక స్థంబాలు ఒకదానిలో ఒకటి ఒకే స్థంభంలో మరికొన్ని కలిసిపోయిన నిర్మాణ శైలి ద్యోతకమౌతుంది. ఆలయ వేదికవద్ద కొన్ని సుస్పష్టంగా కనిపిస్తాయి. ఈ గుడి వేయి స్థంబాలతో నిర్మితం కావడం మాత్రమే కాదు, ఇక్కడ మరో చారత్రక విశిష్టత ఉంది. నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకినా, స్పర్సించినా సప్తస్వరాలతో లయబద్ధ మైన మధుర సంగీతం మన వీనుల విందు చేస్తుంది ఆ స్థంబాలపై.




వేయి స్థంబాల దేవాలయం లో మూడడుగుల ఎత్తయిన మూలం లేదా అధిష్టానంపై ఉంది. త్రికూటాలయాలు 75 నుండి 85 అడుగుల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. ఎక్కడ చూసినా అందాలోలికే శిల్పసౌందర్యం కొలువై ఉంటుంది. దక్షిణాన ఎత్త యిన ద్వారశాల, వేయి స్తంభాల మండపం లో ఎత్తయిన పీఠం మీద ఆరడుగులకు పైగా ఎత్తైన ప్రవేశద్వారం వద్ద ఉన్న అతి పెద్ద నందీశ్వరుడు ఏకశిలపై చెక్కిన కాకతీయుల శిల్పకళకు ప్రతీక. 




ఈ వేయి స్థంబాల దేవాలయం ముందే చెప్పినట్లు త్రికూటాత్మకంగా ఉంటుంది. ఒక కూటంలో శివుడు, మరో కూటంలో విష్ణుమూర్తి, ఇంకో కూటంలో సూర్యభగవానుడు కొలువైఉన్నారు. ఇక్కడ బ్రహ్మకు స్థానం లేదు. ఎత్తయిన వేదిక మీద మధ్యలో నృత్య గాన మందిరం ఉంది. పూర్వం ఈ నృత్య మందిరం గాయనీ గాయకుల పాటలతో, నర్తకీ మణుల నృత్యాలతో అలరారేదని చెప్పే ఆధారాలు ఉన్నాయి. ఈ మందిరం పై కప్పంతా పద్మాక్రుతిలో శిల్ప శైలి ఉంటుంది.




వేయి స్థంబాల గుడి కాకతీయ ప్రాచీన కళా వైభవాన్ని, అద్భుత శిల్ప సౌందర్యాన్ని, నైపుణ్యాన్ని, కళాత్మక కౌశల్యాన్ని చాటుతూ ఈనాటికీ చారిత్రక దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటోంది. అయితే ఈ త్రికూటా లయంలో దురదృష్ట వశాత్తూ సూర్యభగవానుడి విగ్రహం మాత్రం ప్రస్తుతం కనిపించదు. ఇలాంటి చారిత్రాత్మక ప్రాచీన దేవాలయాలను, అపురూపమైన శిల్ప సంపదను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంమీద, మనమీద కూడా ఉంది. ఈ డేవాలయాల వెనుకనున్న కొండలు వేగంగా వీచేగాలుల తాకిడి నుండి ఈ ఆలయ అందానికి రక్షణగా నిలిచాయి. ఈ గుడి కాకతీయరాజులకు ఉన్నశిల్పకళా తృష్ణకు ఒక ప్రతీక అని చెప్పవొచ్చు ఇది దక్షిణ భారతంలోనే అతి పురాతనమైన దేవాలయాల్లో ఒకటిగా చెప్పవొచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: