ఉడకబెట్టిన వేరుశనగలు తింటే ఏమవుతుందో తెలుసా..?

lakhmi saranya
వేరుశనగలు అంటే ఆరోగ్యానికి మంచివని మనందరికీ తెలుసు. కానీ వాటిని ఉడకబెట్టి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ప్రత్యేకంగా ఉదయం వేళ లేదా సాయంత్రం సమయాల్లో వేరుశనగలు ఉడకబెట్టి తినడం శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఇవి ఒక సంపూర్ణమైన ప్రోటీన్ ఫుడ్, ఎన్నో పోషకాల భాండాగారం కూడా. వేరుశనగల్లో మంచి గుణనిలువైన ప్రోటీన్ ఉంటుంది. బాడీ మసిల్స్ బలంగా పెరగడానికి, శరీర నిర్మాణానికి ఇది సహాయపడుతుంది. జిమ్ చేసే వారు, శ్రమాత్మక పనులు చేసే వారికి అద్భుతమైన స్నాక్. వేరుశనగల్లో ఫైబర్ ఎక్కువ. ఇది పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది. ఆకలిని నియంత్రించి, తక్కువకాలొరీస్‌తో శరీరాన్ని సంతృప్తిగా ఉంచుతుంది. ఓసారి తింటే గంటలపాటు ఆకలి వేయదు.

 వేరుశనగల్లో "మోనోసాచ్యురేటెడ్ మరియు పాలీసాచ్యురేటెడ్ ఫ్యాట్స్" ఉండడం వలన ఇవి హృదయానికి మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుండెపోటు ముప్పు తగ్గుతుంది. ఉడికించిన వేరుశనగల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. హేమోగ్లోబిన్ స్థాయి మెరుగవుతుంది. మహిళలు, గర్భిణీలు తప్పనిసరిగా చిటికెడు ఉప్పు వేసుకుని తినవచ్చు. వేరుశనగల్లో నియాసిన్, ఫోలేట్, విటమిన్ E లాంటి మెదడు ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. వేరుశనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఒమెగా-6 ఫ్యాటి యాసిడ్స్ ఉండటం వల్ల చర్మానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది.

జుట్టు ఒత్తుగా పెరగటానికి సహాయపడతాయి. వేరుశనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. ఇది రక్తంలో షుగర్ స్థాయిని ఒక్కసారిగా పెంచదు. డయాబెటిస్ ఉన్నవారు మితంగా తీసుకోవచ్చు. ఇందులో అధికంగా ఉండటం వల్ల, జీర్ణవ్యవస్థ సవ్యంగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్య ఉండే వారికి ఇది సహజ చికిత్స. వేరుశనగల్లోని మాంగనీస్, ఫాస్ఫరస్, మగ్నీషియం శరీరానికి శక్తిని అందిస్తాయి. రోజంతా చురుకుగా ఉండటానికి సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, వేరుశనగల్లో ఉండే రిస్వరట్రాల్ అనే పదార్థం క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధించగలదని తెలుస్తోంది. ముఖ్యంగా స్టమక్ & కాలన్ క్యాన్సర్‌కు ఇది ప్రొటెక్టివ్‌గా పనిచేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: