చిన్న ట్రిక్ తో లైఫ్ లో బిగ్ ఛేంజ్..ప్రతి అమ్మాయి-అబ్బాయి తెలుసుకోవాల్సిన విషయం ఇది..!
కొంతమంది చదువుల్లో ఫెయిల్ అయ్యారు అని .. మరి కొంతమంది జాబ్ రావట్లేదు అని.. మరి కొంతమంది ప్రేమ వివాహం చేసుకోలేకపోయాము అని .. రకరకాల కారణాలతో సూసైడ్స్ చేసుకుంటున్నారు. అయితే ఆ బాధ వాళ్ళ తల్లిదండ్రులకు ఎప్పటికీ తీర్చలేనిది . కొంచెం సమయం ఆలోచించి మన ప్రాబ్లం ఏంటి అనే విషయాన్ని గ్రహించి పది నిమిషాలు కూర్చుని ఆలోచిస్తే కచ్చితంగా మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది . ప్రాబ్లం క్రియేట్ చేసిన దేవుడు దానికి సొల్యూషన్ కూడా ఖచ్చితంగా ఇస్తాడు అని అంటూ ఉంటారు మన ఇంట్లోని పెద్దవాళ్లు .
అది నిజమే ఏ విషయానికైనా సొల్యూషన్ ఉంటుంది . ఒకసారి ఫెయిల్ అయితే రెండోసారి ఎగ్జామ్ రాయచ్చు ..రెండోసారి ఫెయిల్ అయితే మూడోసారి ఎగ్జామ్ రాయచ్చు ..చదువు బుర్రకి ఎక్కడం లేదు అనుకుంటే వ్యాపారం పెట్టుకోవచ్చు . ఇక ప్రేమ విషయం అంటారా మనల్ని నిజంగా ప్రేమిస్తే ఈ అమ్మాయి లేదా అబ్బాయి మనల్ని బాధ పెట్టే పనులు చేయరు . ఇక పెళ్లి తర్వాత వచ్చే ఒడిదుడుకులు అందరూ ఎదుర్కొన్నటివే . కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా సరే కోపాన్ని కంట్రోల్ చేసుకొని మన ప్రాబ్లం ఏంటి అని పది నిమిషాలు ఆలోచించి దానికి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది అని మాట్లాడుకుంటే కచ్చితంగా వాళ్ళకి సూసైడ్ ఆలోచనలే రావు. ఎవరో సూసైడ్ చేసుకున్నారో మనం కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోతామని ఒకరిని చూసి ఒకరు సూసైడ్ చేసుకునే జనాభానే ఎక్కువగా ఉన్నారు . చిన్న ట్రిక్ ..కోపం వచ్చిన్నప్పుడు కొంచెం సేపు సైలెంట్ గా కూర్చునేసి మన ప్రాబ్లం ఇది అని మనలో మనమే మాట్లాడుకుంటే ఆ సూసైడ్ అన్న ఆలోచన మన దగ్గరకు రావు..!