
బీట్రూట్ జ్యూస్ ను చీప్ గా చూస్తున్నారా?.. అయితే పప్పులో కాలేసినట్లే అండోయ్..!
ఇది మన శరీర అభివృద్ధికి చాలా ముఖ్యమైన పోషకమైన ప్రోటీన్లను కూడా పుష్కలంగా అందిస్తుంది. బీట్ రూట్లలో బీటాలైన్లతో పాటు విటమిన్ సి, ఐరన్, పొటాషియం, ఫోలేట్, డైటరి ఫైబర్ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం బీట్ రూట్ తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ డైలీ ఉదయం బీట్ రూట్ జ్యూస్ ని తప్పకుండా తాగండి. ఇంకా పలు స్పెషల్ వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. బీట్ రూట్ ను చాలా మంది దీని రుచిని ఇష్టపడరు.
కానీ దీని పోషక విలువలు తెలిసినా వారు తమ రోజువారి ఆహారంలో కచ్చితంగా చేర్చుకుంటారు. తరచుగా మలబద్ధకం, పొట్ట సమస్యలతో బాధపడేవారు బీట్ రూట్ ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ మీ జీర్ణ క్రియలు మెరుగు పరుస్తుంది. మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే, మీరు బీట్ రూట్ సలాడ్ లేదా జ్యూస్ ని తప్పనిసరిగా తీసుకోవాలి... ఇలా చేయడం ద్వారా మీ బిపి కొద్ది రోజుల్లోనే అదుపులో ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్ ని ఉదయాన్ని తాగటం చాలా మంచిది. రక్తహీనత సమస్య దూరం అవుతుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది.