బ్రోకలీ Vs కాలీఫ్లవర్... వీటిల్లో ఆరోగ్యాన్ని ఏది బెస్ట్ అంటే..!
కానీ రంగులు వేరు అంతే. ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే క్యాలీఫ్లవర్ కంటే బ్రోకలీ ఖరీదు ఎక్కువ. బ్రోకలీని ఎక్కువగా విదేశీయులు తింటూ ఉంటారు. బ్రోకలీని వినియోగం ఇండియాలో చాలా తక్కువ. వీటిల్లో అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, దీర్ఘకాలిక వ్యాధుల్ని దూరం చేయటంలో ఇవి ఎంతో హెల్ప్ చేస్తాయి. మరి ఈ రెండిటిలో ఏది ఎక్కువగా ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాలీఫ్లవర్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది వీటితోనే ఎక్కువగా రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఇందులో శరీరానికి అవసరం అయిన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. క్యాలీఫ్లవర్ ప్రతిరోజు తిన్న ఆరోగ్యానికి చాలా మంచిదే.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్త సరఫరా క్రమంగా చేయడంలో కాలీఫ్లవర్ ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువ. కాబట్టి బరువు తగ్గాలన్న కాలీఫ్లవర్ కంట్రోల్ చేస్తుంది. బ్రోకలీ అనేది పోషకాలకు హౌస్ గా చెబుతారు. పచ్చి బ్రోకలిని కూడా శుభ్రంగా వాష్ చేసి... సలాడ్స్ వంటి వాటిల్లో యాడ్ చేసుకుని తినేయవచ్చు. బ్రోకలీలో విటమిన్లు ఎ, సి, కె, ఫోలేట్, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ఖనిజాలు లభిస్తాయి. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో, జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో కూడా బ్రోకలీ ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఒత్తిడి, ఆందోళన కంట్రోల్ చేయడంలో కూడా బ్రోకలి సహాయపడుతుంది. బ్రోకలీ తినటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. డయాబెటిస్, బీపీని కూడా అదుపులో ఉంచుతుంది. బరువులు కూడా కంట్రోల్ లో ఉంచుతుంది.