చలికాలంలో తేనె తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!
చలికాలంలో ముడి తేనెను ఒక స్పూన్ తీసుకోవటం వల్ల చిన్న చిన్న వ్యాధులనుంచి ఉపశ్రమమం కలిగిస్తుంది. అంతేకాకుండా రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది. చలికాలంలో రోజుకు ఒక స్పూన్ తేనె తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చూద్దాం. ఇందులో ఉండే సహజమైన యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ప్లమేటరి గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వలన గాయాలు త్వరగా మానిపోతాయి. శరీరానికి హాని కలిగించే వైరస్ లనుతేనె నాశనం చేస్తుంది. తేనెను రెగ్యులర్గా తీసుకుంటే జీర్ణ ఆశలను దూరం చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనే కలిపి తాగితే శ్వాస సమస్యలు దూరం అవుతాయి. తేనే శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్ శరీర కణాలు, ఆక్సిడేటివ్ డామేజ్ అవ్వకుండా సహాయపడుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. తేనే చర్మాన్ని మాయిశ్చరైజర్ గా పనిచేసి, మృదువుగా ఉండేలా చేస్తుంది. చలికాలంలో చాలా మందికి పెదవులు, ముఖంపై మంట వంటి సమస్యలు వస్తాయి. తేనెను ముఖానికి రాయడం వల్ల ఆ సమస్యలు తగ్గుతాయి. డ్రై స్కిన్ కు కూడా ఈ తేనే చెక్ పెడుతుంది. తేనెలో ఉండే గ్లూకోజ్ లు శరీరానికి శక్తిని ఇస్తాయి. ఒత్తిడి, అలసటగా ఉంటే టీలో ఒక స్పూన్ తేనె కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది. ఉదయం లేవగానే ఒక స్పూన్ తేనెను తీసుకోవటం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. కొంతమంది నిద్ర సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటివారు గోరువెచ్చని పాలల్లో తేనెను కలిపి తాగితే, బాడీ రిలాక్స్ హాయిగా నిద్ర పడుతుంది.