వెళ్లోద్దామా...వింటర్ టూర్....!
అప్పుడు కూడా మంచు దట్టంగా ఉండే ప్రదేశాలని చాలామంది పర్యాటకులు ఎంచుకుంటారు. ఫలితంగా వేసవితో పాటు శీతాకాలం కూడా పర్యాటకులతో ఈ ప్రదేశాలు సందడి చేస్తుంటాయి. దేశంలోని బెస్ట్ వింటర్ టూరిస్ట్ స్పాట్స్ ఏమిటో తెలుసుకుందాం. భూతాల స్వర్గంగా పెంపొందిన జమ్మూకాశ్మీర్ లో పర్యాటకులను అలరించే అనేక ప్రదేశాలు ఉన్నాయి. కానీ, వీటిలో గుల్మార్గ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా ప్రసిద్ధికెక్కింది. హిమాలయాలోని పీర్ పంజాల్ పర్వతసాణువుల్లో మంచుతో కప్పబడే కొండలు,
చెట్లు సైతం మంచుతో నిండి ఉండే ఈ ప్రదేశం పర్యాటకులను చూపు తిప్పుకొనివ్వదు. మంచు వర్షానికి ఇళ్ల పైకప్పులు మంచుతో కప్పబడి ఉంటాయి... మైదానాల్లో మూడు, నాలుగు అడుగుల మేర మంచు పేరుకు పోవటంతో పర్యాటకులకు ఆటలతో సేద తీరుతారు. కాగా, గుల్మార్గ్ అనేది ఓ అడవి పువ్వు . పచ్చికబయళ్లలో ఎక్కువగా పూచే ఈ పూలు... అక్కడ అనేక రకాలు ఉన్నాయి. అందుకే మొషుల్ రోజులు అక్కడి నుంచి ఎర్రకోటకు దాదాపు 21 రకాల గుల్మార్గ్ పూల జాతలను తీసుకెళ్తారట. అందుకే ఈ ప్రాంతానికి గుల్మార్గ్ అని పేరు వచ్చింది. ఇక ఇక్కడ అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చిల్డ్రన్స్ పార్క్, ఫిరోజ్ పూర్ నాలా, తంగ్ మార్గ్ తదితర ప్రదేశాలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. వింటర్లో జరిగే మంచు ఉత్సవాలు గుల్మార్గ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.