మనం తినే కూరగాయలు విదేశాలవా? ఆశ్చర్యపోకండి... ఆధారాలు ఇవే!

lakhmi saranya
కూరగాయలు ఎక్కువగా తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ కూరగాయలు ఇతర దేశాల నుంచి పండుతున్నాయా లేదా మన దేశాల్లో పండుతున్నాయా అనే సందేహం అందరిలో వచ్చే ఉంటుంది. వంటలు వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా కూరగాయలు తప్పనిసరిగా వాడుతుంటాము. అయితే, మనం రోజు తినే కూరగాయలు మన దేశంలో పుట్టలేదంటే మీరు నమ్ముతారా. మనం ప్రతిరోజు వాడే కూరగాయలు మన దేశానికి చెందినవి కావు. వీటి మూలాలు వేరే దేశాల్లో ఉన్నాయని ఆధ్యాయణాలు చెబుతున్నాయి. ఈ కూరగాయలు ఇతర దేశాల నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యాయి. వాటిలో టమాట, బంగాళదుంప, పచ్చిమిర్చి వంటివి విదేశాలకు చెందిన కూరగాయలు.
 అసలు ఈ కూరగాయలు ఏ దేశానికి చెందినవి? వీటిని ఎవరు తీసుకొచ్చారు? మన దేశానికి చెందిన కూరగాయలు ఏమి అనేది ఎప్పుడు తెలుసుకుందాం. టమాటా అనేది వంటకు ముఖ్యమైన కూరగాయ. నిత్యం ఇంట్లో టమాటా అవసరం ఉంటుంది. అసలు టమాటా లేకుండా చాలా కూరలు తయారవ్వవు. దేశవ్యాప్తంగా కూడా ఈ టమాటా పంటను ఎక్కువగా పండిస్తున్నారు. కానీ, ఈ టమాటా మన దేశానికి చెందినది కాదు. ఇది సౌత్ అమెరికాకు చెందినది. టమాటా సౌత్ అమెరికాలోని ప్రధాన వంటల్లో ఒకటి. దీనిని పోర్చుగీసుకు చెందిన వ్యాపారులు భారత్కు తీసుకొచ్చారు. ఇటీవల చాలామంది వంటకాలలో దీనిని ఉపయోగిస్తున్నారు. కానీ ఇది ఇటలీకి చెందిన కూరగాయ.
మరొక కూరగాయ క్యాప్సికం. ప్రస్తుతం బాగా ఉత్పత్తి అవుతున్న వాటిలో ఈ క్యాప్సికం ఒకటి. వీటిని ఎక్కువగా బెంగళూర్ నుంచి లోకల్ మార్కెట్లకు దిగుమతి చేస్తుంటారు. అయితే, ఈ క్యాప్సికం పుట్టింది అమెరికాలో. బెండకాయ కూడా భారతదేశానికి చెందినది కాదు. దీనిని ఈజిప్టులో ఎక్కువగా పండిస్తారు. అక్కడి నుంచే ఈ బెండకాయ భారత్ కు వచ్చింది. అయితే, దీనిని ఈజిప్టియన్లు తీసుకొని రాలేదు. ఈజిప్టులో ఉండే బంటు అనే ఓ గిరిజన తెగకు చెందిన వ్యాపారులు, అప్పట్లో పడవల ద్వారా భారతదేశానికి తీసుకొచ్చారు. ఈజిప్టులో ఉండే కొన్ని వస్తువులను భారతీయులకు ఇచ్చి, ఇక్కడ ఉన్న సుగంధ ద్రవ్యాలను వాళ్లు తీసుకెళ్లేవారు. అలా బెండకాయను ఈ తెగ వారు అక్కడ పరిచయం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: