నెగిటివ్ థింకింగ్స్ వస్తున్నాయా?.. అయితే ఇలా చేయండి..!
నిరంతరం ఆలోచిస్తూ ఉండటం వల్ల ఒత్తిడికిలోనై ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందట. ఈ నెగిటివ్ గా ఆలోచనలు ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మగౌరవాణి కూడా దెబ్బతీస్తాయి. అంతేకాకుండా సంబంధాల పైన ప్రభావాన్ని చూపుతాయి. అందుకే నెగిటివ్‌గా ఆలోచించడం మానేయాలి. పాజిటివ్ గా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. నిద్రలేచిన తర్వాత మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలి. మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా వ్యాయామం, మెడిటేషన్ చేయాలి. ఇది మీ మూడ్ ని మార్చడమే కాకుండా.. నెగిటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది.
మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని మీకు నచ్చకపోతే దాని గురించే ఆలోచిస్తూ, ఆ పని చేయలేనటూ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మూడ్ ని రిఫ్రెష్ చేయడానికి ట్రైయ్ చెయ్యండి. మీరు ఏదైనా పని చేయాలని అనుకున్నప్పుడు అది కరెక్టా కాదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకటికి రెండుసార్లు నిదానంగా ఆలోచించి ఆ పనిని చేయండి. సెల్ఫ్ టాక్ కి టైమ్ ఇవ్వండి. ఇలా ఆలోచించడం వల్ల మీ మైండ్‌లో నెగిటివ్ ఉంటే... దానిని పాజిటివ్ గా మార్చుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల నెగిటివిటీ పోయి పాజిటివ్‌గా ఆలోచించడం వస్తుంది.