జీవితాన్ని మలుపు తిప్పే గెలుపు సూత్రాలు.. పాటిస్తే సక్సెస్ మీదే..!

lakhmi saranya
మన జీవితం ఎన్నో రకాలుగా మలుపు తిరుగుతూ ఉంటుంది.మనకు తెలియకుండానే ఏదో జరిగిపోతూ ఉంటుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు మిమ్మల్ని ఆనంద పారవశ్యంలో ముంచెత్తే సందర్భాలు ఎదురౌతుంటాయి. మరికొన్నిసార్లు వడిదుడుకుల సుడిగుండాలు వెంటాడుతుంటాయి. ఇంకొన్నిసార్లు సమస్యలు అధికమై సవాళ్లు విసురుతుంటాయి. ఇది ఏ ఒకరి విషయంలోనో కాదు, ప్రతి ఒకరి పర్సనల్ అండ్ ప్రోఫెషనల్ లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోవాల్సిన అనుభవాలుగా ఉంటాయని మోటివేషనల్ అండ్ పర్సనల్ స్కిల్స్ అంటున్నారు.
సరిగ్గా అలాంటప్పుడే మీరు తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని మలుపు తిప్పగలిగే గెలుపు సూత్రం కావాలంటే మీరు తప్పక కలిగి ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. మనుషులన్నాక బాధలు, కష్టాలు, నష్టాలు వచ్చి పోతుంటాయ్. అయితే ఇక్కడ భావోద్వేగాలు కూడా మీ గెలుపోటములను నిర్ణయిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఇది అసలు లేకపోవటం లేదా అతి భావోద్వేగాలు కూడా మీకు నష్టం కలిగిస్తాయి. కాబట్టి కోపం, బాధ, సంతోషం, ఏడుపు, దుఃఖం... ఇలా ఏదీ వచ్చిన ఆ ఉద్వేగ భారిత సందర్భాన్ని అనుభవించడంతోపాటు కంట్రోల్ చేయగలిగే శక్తి సామర్థ్యాలను అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు.
కొందరు తామున్న రంగంలో రాణించక పోవడానికి భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం కూడా ఒక ఆటంకంగా మారుతుంది. కాబట్టి చదువులో, ఉద్యోగంలో, జీవితంలో, ఎక్కడైనా, ఎప్పుడైనా ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు విచక్షణగా ఆలోచించండి. ఆ సందర్భంలో వాటిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థమైతే మీకు ఎదురే లేదిక. తెలియనప్పుడైతే ఓకే. కానీ తెలసి కూడా మీరు స్వియ క్రమ శిక్షణ పాటించడం లేదంటే అది మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు. పైగా అదే బ్రహ్మ విద్య కాదు, మీరు సాధన చేయడం ద్వారా అలవాడే శ్రియ నియంత్రణ సామర్థ్యం. మనుషులన్నాక బాధలు, కష్టాలు, నష్టాలు వచ్చి పోతుంటాయ్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: