రాంప్ వాక్ లో మోడల్స్ ఎందుకు నవ్వరు?.. అసలు రహస్యం ఏమిటి..?
వాస్తవానికి నవ్వు సానుకూలతకు ప్రతిరూపం. ఎదురుగా ఎవరైనా ఉన్నప్పుడు చిరునవ్వు చిందించారంటే, మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని అవతలి వ్యక్తి భావించే అవకాశం ఎక్కువ. దీంతో అవతలి వ్యక్తి మనసులో సమానత్వ, సానుకూల భావన ఏర్పడుతుంది. అయితే మోడల్స్ మాత్రం ఫ్యాషన్ లో ఇలాంటి భావనలకు భిన్నంగా ఉండాలనుకుంటారు. ఇక్కడ ఇతరులను డామినేట్ చేసేలా తమ బిహేవియర్ ఉండాలని ఆలోచిస్తారు. ఇది రాంప్ వాక్ లేదా ఫ్యాషన్ షో నిర్వహణలో ఒక అంతర్గత నిబంధనగా కూడా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
ర్యాంపు పై ఉన్నప్పుడు నవటం వల్ల తమ హోదా లేదా స్థానాన్ని ప్రేక్షకులు గుర్తించే అవకాశం తగ్గుతుందని మోడల్స్ భావిస్తారు. తమ నవ్వులు, మాటలు వంటివి ఆడియన్స్ను ఆకట్టుకుంటే... తాము ధరించిన దుస్తులను, సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ను వారు నిర్లక్ష్యం చేయవచ్చు. దీంతో తాము అనుకున్నా మెసేజ్ ప్రేక్షకుల్లోకి వెళ్ళదు. అదే గాంభీర్యంగా ఉంటే ప్రేక్షకులు మోడల్స్ మొహాలను, వారి మాటలను పట్టించుకోరు. దీంతో వారి హవ భావాలపై, ధరించిన దుస్తులపై మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి మోడల్స్ ఈ సందర్భముగా నవ్వరని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే నవ్వడం అనేది సానుకూల భావోద్వేగానికి, సీరియస్ నెస్ అనేది అక్కడున్న పరిస్థితిపై పైచేయి కలిగి ఉన్న భావనకు నిదర్శనంగా సీరియస్ నెస్ అనేది అక్కడున్న పరిస్థితిపై పైచేయి కలిగి ఉన్న భావనకు నిదర్శనంగా భావిస్తారు ఎవరైనా.