పాడు చేస్తున్న అటువంటి అలవాట్లు.. యవ్వన ఛాయలు కూడా మాయం..!

lakhmi saranya
మనుషుల్లో కూడా రకరకాలుగా ఉంటారు. కొంతమంది నల్లగా ఉంటారు మరి కొంతమంది తెల్లగా ఉంటారు రంగు బట్టి కాకుండా గుణం బట్టి చూడాలి. అందమంటే నలుపు తెలుపు ఛాయా కాదిక్కడ. చర్మం రంగుతో సంబంధం లేకుండానే ఉన్నంతలో అట్రాక్టివ్ గా కనిపించాలనుకోవడమే అసలైన అందంగా నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి తాము అందంగా, యవ్వనంగా, ఆకర్షణయంగా కనిపించాలని ప్రతి ఒకరు కోరుకుంటారు. యంగ్ గా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ కొందరు యవ్వనంలో ఉన్న జుట్టు రాలడం, ముఖంపై ముడతలు,
యవ్వన దశలో కూడా వృద్ధాప్య ఛాయలు కనిపించడం వంటి ఇబ్బందులను ఫేస్ చేస్తుంటారు. అయితే ఇందుకు కొన్ని రకాల బాడ్ హ్యాబిట్స్, ఆరోగ్య సమస్యలు కూడా కారణం అంటున్నారు నిపుణులు. అవేమిటి? ఎలా పోగొట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. యవ్వనంలో కూడా వృద్ధాప్య ఛాయాలకు దారితీస్తున్న పలు కారణాల్లో మానసిక ఒత్తిడి, అధికరక్తపోటు, డిప్రెషన్ వంటివి ఉంటున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కొన్నిసార్లు వీటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్యాలకు కూడా దారితీయవచ్చు. పైగా తరచుగా స్ట్రెస్ కు గురికావడం వల్ల మీలో హ్యాపీ హార్మోన్లు విడుదలకు అడ్డుకుంటుంది. కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ ను పెంచుతుంది.
 దీంతో చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయాలకు దారితీస్తాయి. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఒత్తిడికి ఎదుర్కొనే శక్తిని పెంపొందించుకోవాలి లేదా అలాంటి వాతావరణాన్ని దూరం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హైపర్ టెన్షన్, డిప్రెషన్ వంటివి కూడా అత్యంత వ్వరగా మెదడును ప్రభావితం చేయడం ద్వారా అల్జీమర్స్ కు, వృద్ధాప్య ఛాయాలకు దారితీస్తాయి. కాబట్టి ఈ లక్షణాలను గుర్తిస్తే వెంటనే అలెర్ట్ అవ్వాలంటున్నారు నిపుణులు. మితిమీరిన ఆహారపు అలవాట్లు, ప్లాస్టిక్ బాటిల్స్ తరచుగా ఉపయోగించడం కూడా మీలో వృద్ధాప్య చాయాలకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. సరైన పోషక ఆహారం బాడీకి అందకపోవటం వల్ల కూడా ఇలా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: