పెళ్లయిన కొత్తలో.. ఆ ఆందోళన దేనికి..?
ఒక పెళ్ళికి ముందు బ్యాచిలర్ పార్టీ, హల్దీ వేడుక, మెహందీ వేడుక, అలాగే మ్యారేజ్ రోజు, రిసెప్షన్ రోజు వాటిని ఖర్చు చేస్తుంటారు. అయితే కొందరు తమ అంచనాలకు మించి ఖర్చు చేయడం, అప్పులు చేసి మరీ వేడుకలు చేయడం ఆర్థిక ఆందోళనకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఆదాయానికి మించిన ఖర్చులు వివాహం తరువాత ఇబ్బందుల్లో నడతాయి. పెళ్లి ప్రారంభం కాకముందు నుంచే పలువురు భారీగా ఖర్చు చేస్తుంటారు. పెళ్లి చాలా ఘనంగా జరగాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ తహతుకు మించిన అంచనాలతో ఉండటమే ఇక్కడ సమస్యగా మారుతుంది.
ఫంక్షన్ హాల్స్ కోసమని, బట్టలు, జ్యువెలరేస్, క్యాటరింగ్, బ్యూటీషన్లు, ఫోటోగ్రఫీ, ప్రి వెడ్డింగ్ షూట్, కట్న కానుకలు వంటివి ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతాయి. కొందరైతే అప్పులు చేసి మరీ పెళ్లి తంతు పూర్తి చేయాలని అనుకుంటారు. కానీ పెళ్లి తర్వాత భారంగా మారుతుంది అంటున్నారు నిపుణులు. పెళ్లి తరువాత హనీమూన్ కు వెళ్లడం చాలా కామన్.. ఇందుకోసం ఖర్చు కూడా బాగానే ఉంటుంది. జంటలు వెళ్లాల్సిన ప్రదేశాలు, హోటల్స్, రిసార్ట్ లను బట్టి ఎక్కువ మొత్తంలో ఖర్చయిపోతుంటాయి. ఇక జర్నీ కోసం అయ్యే ఖర్చులు కూడా ఉంటాయి. పెళ్లికి ముందే ఇవన్నీ ఆలోచించి తగిన బడ్జెట్ సమకూర్చుకోకుంటే మాత్రం తరువాత అవస్థలు పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.