అవునంటే కాదని.. కాదంటే అవునని.. ఆపోజిట్ సైకాలజీ చేసే అద్భుతాలు ఏంటో తెలుసా..!
అలాంటప్పుడు వారిని మంచి మార్గంలో నడిపించాలంటే రివర్స్ సైకాలజీ మెరుగ్గా పనిచేస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్ని సందర్భాల గురించి వివరిద్దాం. 'మంచిగా చెబుదాం... మంచిగా మాట్లాడుదాం... మంచి మాటలతో ఎదుటి వ్యక్తిని దారిలోకి పెట్టడం. వాస్తవాలను అర్థం చేసుకునేలా చెప్పడం ' అనుకునేవారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా పేరెంట్స్ తమ పిల్లలను, ఉపాధ్యాయులు విద్యార్థులను, మానసిక నిపుణులు బాధితులను ఇలా దారికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ కొందరి విషయంలో ఇది పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు అవతలి వ్యక్తి పట్ల వ్యతిరేక వైఖరి, ప్రతికూల దృక్పథం, హెచ్చరిక సంకీర్తనలు వంటివి ఉపయోగించాల్సి ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
అంటే అక్కడ రివర్స్ సైకాలజీ ఉపయోగించడం వల్ల మంచి మార్పు సాధ్యం అవుతుంది. ఉదాహరణకు ఒక టీనేజర్స్.. క్లాస్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లోద్దంటే తప్పక వెళ్లేందుకు ట్రై చేస్తాడు. బైక్ నడప వద్దంటే... నడిపేందుకే మగ్గు చూపుతాడు. మంచి మాటలతో, ప్రేమతో చెప్పే ఇక్కడ వినే పరిస్థితి ఉండదు. ఇలాంటి అప్పుడు తల్లిదండ్రులు రివర్స్ సైకాలజీ యూత్ చేయవచ్చు. అతన్ని హెచ్చరించడానికి బదులు 'నీకు ఇష్టంమొచ్చిన మూవీస్ చూడాలని, అవసరం అయితే సెలవు పెట్టి వెళ్లాలని చెప్తూ తల్లిదండ్రులే సలహా ఇస్తే.. అప్పుడు ఆ టీనేజర్ ఉత్సాహ పడవచ్చు. ఆనంద పడవచ్చు. కానీ తరువాత ఇంకెప్పుడు క్లాస్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లోద్దనే ఆలోచనలో మాత్రం తప్పక పడతాడు అంటున్నారు మానసిక నిపుణులు.