వార్నీ.. దోమలకు తెలివితేటలు పెరిగిపోతున్నాయట?
సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు తను తెలివిని ఉపయోగించుకుని మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. ఇలా ఏదో ఒక విధంగా మనుగడను సాధించడానికి ముందుకు సాగుతూనే ఉంటాడు. అచ్చం ఇప్పుడు మనుషుల్లాగానే దోమలు కూడా తెలివి మీరిపోతున్నాయట. అదేంటి దోమలు తెలివి మీరి పోవడమేంటి అని కాస్త ఆశ్చర్యపోతున్నారు కదా. నిజమే ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఇదే బయటపడింది. ఇంతకుముందుతో పోల్చి చూస్తే ఇక ఇప్పుడు దోమలు మనుగడ కోసం ఎంతో తెలివిగా ఆలోచిస్తున్నాయట.
ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. దోమలు చూడడానికి చిన్నగానే ఉండొచ్చు. కానీ ఇక అవి మనుషులను ఎంతలా ఇబ్బంది పెడుతుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు.. ఎంతో మంది దోమతెరలను లేదా కాయిల్స్ లాంటివి ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే దోమలకు ఉన్న తెలివి ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు మరింత పెరిగిందట. దోమలు రాకుండా కట్టే నెట్స్ లోకి దూరెందుకు సైజు తగ్గించుకుంటున్నాయట దోమలు. అంతేకాదు గుడ్లు పెట్టే సురక్షిత ప్రాంతాల గురించి దోమలు మరికొన్ని దోమలతో సమాచారం చేరవేసి కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి అన్న విషయం పలు అధ్యయనాల్లో తేలింది. ఇక వాటిని చంపేందుకు ఉద్దేశించిన వివిధ రసాయనాలకు లొంగని నిరోధక శక్తిని కూడా అభివృద్ధి చేసుకుంటున్నాయట దోమలు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.