బయటకి వెళ్లినప్పుడు అతిగా తింటున్నారా... ఈ చిట్కాలను పాటిస్తే సూప‌ర్‌..?

lakhmi saranya
ఈరోజుల్లో చాలామందికి బయటి ఫుడ్ అనేది ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బయటకి వెళ్లటం పాపం ఏదో ఒకటి తింటుంటారు. కానీ అలా బయట ఫుడ్ తినటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీని తర్వాత పండుగల పరంపర ప్రారంభమవుతుంది. పండుగ వచ్చిందంటే చాలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. వీటితో పాటు పండుగల సమయంలో ప్రతి ఇంటి బల్లమీద రుచికరమైన వంటకాలు ఉంటాయి. వీటిని చూసినా తరువాత తినకుండా అస్సలు ఉండలేరు. కొంతమంది తమ శక్తి మేరకు ప్రయత్నించిన రుచికరమైన వంటకాలు తినకుండా ఉండలేకపోతారు.
కొందరు తమ మనసు చెప్పినా మాట విని అతిగా తినేసి జీర్ణక్రియ పై భారాన్ని వేసేస్తారు. అందుకే పండుగల సమయంలో అతిగా తినటం మానుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే అతిగా తినటం వల్ల తరచుగా అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దీనివల్ల బరువు కూడా పెరగవచ్చు. కాబట్టి అతిగా తినటం నియరించాలంటున్నారు. అందుకే ఈ చిట్కాలను పాటించి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన పండుగలను ఆనందించండి. ఇంటి నుంచి బయలుదేరే ముందు ఆరోగ్యకరమైన ఆహారాన్ని లేదా అరోగ్యకరమైన  స్నాక్స్ తినాలి.
తద్వారా మీ కడుపు నిండుగా ఉంటుంది. అలాంటప్పుడు బయటి తిండి తినకు అని మనసుకు నచ్చచెప్పవచ్చు. మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమైన చిట్కాగా చెప్పవచ్చు. మనం ఎవరింటికైనా వెళితే వాళ్లు తినమన్నప్పుడు బలవంతంగా భోజనం చేస్తారు. కానీ మీరు తినాలని అనిపించకపోతే లేదా ఆహారం మీ ఆరోగ్యానికి మంచిది కాదని భావిస్తే దానిని తినటం మానుకోండి. అవతలి వ్యక్తిని తిరస్కరించటం నేర్చుకోండి. ఎందుకంటే మీ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యమైనది కాదు. మనం ఆహారాన్ని తక్కువగా తినాలంటే ముందు నెమ్మదిగా తినటం నేర్చుకోండి. అలాగే ప్లేట్ లో ఎక్కువ ఆహారానికి బదులుగా కొద్దిగా పెట్టుకుని నెమ్మదిగా తినండి. ప్రతి ముద్దను ఆస్వాదించండి. ఇలా చేయటం వల్ల మీ కడుపు నిండిపోతుంది. అలా చేయటం వలన ఎక్కువ తినటానికి ఆహారం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: