మోదీ గ్రేట్.. వృద్ధుల కోసం ఏం చేస్తున్నారో తెలుసా?

కేంద్రం వయో వృద్ధులకు ఒక శుభ వార్త వినిపించింది. ఏడు పదుల నిండిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ వర్తింపజేస్తామని ప్రకటించింది. ఇది ఆరోగ్య బీమా పథకం. ఒక విధంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఇది రక్షణ కవచంగా పనిచేస్తుంది. దేశంలోని ఈ విధంగా 70 ఏళ్లు నిండిన వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.


ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. ఇది గొప్ప మానవతావాదంతో తీసుకున్న నిర్ణయం అని ఆయన అన్నారు. దేశంలో చూస్తే డెబ్బై ఏళ్లు నిండిని వారు ఆరు కోట్ల దాకా ఉన్నారు. వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఇక 70 ఏళ్లు నిండితే చాలు వారి ఆర్థిక పరిస్థితులు ఇతర వ్యవహారాలతో సంబంధం లేకుండా.. రూ.5లక్షల దాకా ఆరోగ్య బీమా పతకం వర్తింజేయడమే దీని ఉద్దేశం.


దీని వల్ల కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం వారు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ పథకం కిందఇప్పటికే ఉన్న కుటుంబాల్లో సీనియర్ సిటిజన్లకు మరో అయిదు లక్షల బీమా వర్తింపజేయనున్నట్లు కేంద్రం చెబుతోంది. ఇక ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్రం 2018 సెప్టెంబరు లో ప్రారంభించింది. అంటే ఇప్పటికి ఆరు ఏళ్లు నిండాయి. ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబంలో పేదలకు ఆయుష్మాన్ భారత్ కార్డుని అందజేస్తారు. ఈ కార్డులతో వారు ఆసుపత్రిలో చేరినప్పుడు అయిదు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందుతోంది.


ఇప్పుడు కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు.. 70 ఏళ్లు పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. అంటే ఇది వయో వృద్ధులకు ఒక వరంగా మారుతోంది అని చెప్పాలి. మొత్తానికి కేంద్రం మంత్రి వర్గం సీనియర్ సిటిజన్లపై కరుణ చూపిందనే చెప్పాలి. దీని వల్ల ఎవరి ఆసరా సాయం లేకుండా జీవితం చరమాంకంలో తమకు వచ్చే జబ్బులకు అయిదు లక్షల రూపాయల వరకు ఉచితంగగా మంచి వైద్యం చేయించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: