పైనాపిల్ అధికంగా తింటే ఈ సమస్యలు తప్పవు?

Purushottham Vinay
పైనాపిల్ అనేది ఎంతో రుచికరమైన పండు. పైగా దీన్నీ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి, అయితే ఇది కొందరికి మాత్రం చాలా హానికరం అని తెలిసింది. పైనాపిల్‌లో విటమిన్ సి, మాంగనీస్, ఫైబర్, ఐరన్ అనేవి ఉన్నాయి. అయితే ఇది కొంతమందికి మాత్రం మంచిది కాదు. పైనాపిల్ తీపి ఇంకా పుల్లని రుచిని కలిగి ఉంటుంది. ఇది సహజమైన చక్కెరతో నిండి ఉంటుంది. ఇందులో గ్లూకోజ్ ఇంకా సుక్రోజ్ పుష్కలంగా ఉంటాయి.అందుకే దీన్ని ఎక్కువగా తింటే, దాని చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్  దీన్ని అస్సలు తినకూడదు.ఎందుకంటే ఇది వారికి చాలా సమస్యలను కలిగిస్తుంది.పైనాపిల్ ఒక ఆమ్ల పండు. అందుకే దీనిని అధికంగా తినడం వల్ల ఎసిడిటీ వస్తుంది.పైగా కడుపులో మంట కూడా ఉండవచ్చు. ఇందులో చాలా ఫైబర్ కూడా ఉంటుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల విరేచనాలు, అజీర్ణం ఇంకా వాంతులు సంభవించవచ్చు.


అలాగే పైనాపిల్‌లో బ్రొమెలిన్‌ అనే ఎంజైమ్ ఉంటుంది. అందుకే దీన్ని తినడం వల్ల రక్తప్రసరణపై తీవ్ర ప్రభావం కూడా చూపుతుంది. దీంతో రక్తస్రావం సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇది రక్తస్రావం పెంచుతుంది.అలాగే పైనాపిల్‌లో బ్రొమెలిన్‌ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. అందుకే దీన్నీ తిన్న తర్వాత కొంతమందికి నాలుకలో దురదను కలిగిస్తుంది.దీన్నీ తింటున్నప్పుడు మీకు కూడా దురదను వస్తున్నట్లయితే లేదా తిన్న తర్వాత ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే, దానిని తినడం వెంటనే మానేయండి. పైనాపిల్ ఒక ఆమ్ల పండు కాబట్టి దాన్ని అధికంగా తీసుకుంటే, అది చిగుళ్ళు, దంతాల ఎనామిల్‌ను ఖచ్చితంగా చాలా తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీనివల్ల దంతక్షయం సమస్య ఏర్పడుతుంది. ఇంకా అంతే కాకుండా దీన్ని తినడం వల్ల అలర్జీలు కూడా వస్తాయి. గొంతునొప్పి, పెదవుల వాపు, మంట వంటి సమస్యలు కూడా మీకు రావచ్చు. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు పైనాపిల్‌కు దూరంగా ఉండడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: