చెరుకు రసం ఎక్కువ తాగితే కలిగే నష్టాలు?

Purushottham Vinay
సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది చల్లని పానీయాలను తాగుతూ ఉంటారు.ముఖ్యంగా వేసవి కాలంలో చాలా మంది కూల్ డ్రింక్స్‌, కొబ్బరి బొండాలు, సోడా వంటి వాటితోపాటు చెరుకు రసంను కూడా ఎక్కువగానే తాగుతుంటారు.మనకు వేసవి కాలంలో  ఎక్కడ చూసినా రోడ్ల పక్కన చెరుకు రసం అమ్మే బండ్లు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే చెరుకు రసం చాలా రుచిగా ఉంటుంది. దీన్ని అందరూ చాలా ఇష్టంగా తాగుతుంటారు. కానీ దీన్ని తాగే విషయంలో మాత్రం తప్పనిసరిగా కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.కొన్ని చోట్ల చెరుకు రసం తీసే వద్ద అపరిశుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈగలు వాలుతుంటాయి. కనుక అలాంటి చోట్ల చెరుకు రసం తాగకపోవడమే మంచిది. లేదంటే ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ బారిన కూడా పడవచ్చు. అలాగే జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, విరేచనాల బారిన పడిన వారు ఎట్టి పరిస్థితిలోనూ చెరుకు రసం తాగకూడదు. ఇక ఆరోగ్యవంతులు కూడా రోజూ చెరుకు రసం తాగడం అంత మంచిది కాదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి.


 ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు, కానీ రోజూ చెరుకు రసం తాగకూడదట.ఇక డయాబెటిస్‌, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, గర్భిణీలు, వృద్ధులు, 4 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, విటమిన్ సప్లిమెంట్లను వాడుతున్నవారు, రక్తాన్ని పలుచగా చేసే ట్యాబ్లెట్లను వేసుకుంటున్నవారు చెరుకు రసంకు దూరంగా ఉండాలి.అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు చెరుకు రసాన్ని తాగకపోవడమే మంచిది. డైట్ పాటించే వారు చెరుకు రసంకు దూరంగా ఉండడమే బెటర్‌. రోజూ దీన్ని తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కనుక అధిక బరువు ఉన్నవారు చెరుకు రసాన్ని తాగకూడదు. అందుకే చెరుకు రసాన్ని ఎట్టి పరిస్థితిలోనూ రోజూ తాగకూడదు. అది కూడా మోతాదుకు మించి అసలు తాగకూడదు. రోజూ పురుషులు అయితే ఒక కప్పు, స్త్రీలు అయితే ముప్పావు కప్పు మోతాదులోనే చెరుకు రసం తాగాల్సి ఉంటుంది. అంతకన్నా మించితే అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి కేవలం మితంగా మాత్రమే తాగండి. అమితంగా తాగవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: