పిల్లలకు అలాంటివి వాడడం వల్ల ..ఆటిజం ముప్పు..!!

Divya
ప్రతి అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులయ్యారని విషయం తెలిసి చాలా ఆనంద పడుతూ ఉంటారు. ఆ సమయంలోనే తమ పిల్లల్ని పెంపక పైన అతి జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. తమ పిల్లలు అందంగా కనిపించాలని..బేబీ కేర్ కోసం కొన్ని రకాల ప్రాడెక్టులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.. ఇందులో ముఖ్యంగా బేబీ వైప్స్ కూడా ఒకటి నిజానికి ఇవి పసిపిల్లల ఆరోగ్యానికి చాలా ప్రమాదాన్ని సృష్టిస్తున్నాయని ఒక అధ్యయనంలో వెళ్ళబడింది. ఇందులో ఉండేటువంటి రసాయనాలు చాలా అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతున్నాయట.. సువాసన రంగు ఇవ్వడానికి బేబీ ప్రొడక్టులలో కొన్ని కెమికల్స్ వినియోగిస్తున్నారని తెలుస్తోంది

ఇవి చాలా హానికరమైనవని పసిపిల్లల శరీరం పైన కూడా ఎన్నో దుష్ప్రభావాలను కూడా చూపిస్తున్నాయట.. ఇటీవలే ఒక పరిశోధనలో ఈ విధమైన రసాయనికలిపిన బేబి ప్రోడక్ట్ వల్ల పిల్లలలో ఆర్టిజం మల్టిపుల్ స్ప్లెరో సిస్ కు కారణమవుతుందని నిపుణులు సైతం తెలియజేశారు.. అంతేకాకుండా హ్యాండ్ వాష్ చేసుకునేందుకు ఉపయోగిస్తున్న వాష్ సొప్స్ కూడా అనారోగ్యానికి గురి చేస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. పరిశోధకులు చెబుతున్న ప్రకారం.. నెయిల్ పాలిష్, హ్యాండ్స్ సోప్స్, బేబీ వైప్స్ వంటి వాటిలో ఎక్కువగా కెమికల్స్ ఉపయోగించే ఆర్గానోఫాస్పేట్ , అమ్మోనియం కాంపౌండ్ వంటివి రసాయనాలు ఉపయోగిస్తున్నారని ఇవి పిల్లల మెదడు లోని నరాల వరకు వెళ్లి దెబ్బతీస్తాయని దీనివల్ల ఆటిజం వంటి ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటారని తెలుపుతున్నారు.

ఎవరైనా సరే చిన్నపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత శుభ్రత కోసం ఎక్కువగా భయపడకూడదు చిన్నపిల్లలకు బేబీ వైప్స్ ని అసలు ఉపయోగించకూడదట. OFR,QAC వంటి రసాయనాలు కలిగిన పదార్థాలు చిన్న పిల్లలకు చాలా ప్రమాదమని తెలిపారు.. అయితే ఈ పదార్థాలు ఎక్కువగా ఫర్నిచర్, నెయిల్ పాలిష్, కార్పెట్ ఎలక్ట్రానిక్, డ్రయర్ సీట్లలో ఎక్కువగా ఉంటుందట OFR..
QAC రసాయనం సూక్ష్మ క్రిములను చంపడానికి ఉపయోగిస్తారు.. ఎక్కువగా క్లీనింగ్ చేసే ఉత్పత్తులు బాడీ లోషన్స్ షాంపూలు వంటి వాటిలో కనిపిస్తుంది. అందుకే పిల్లలకు ఇలాంటి వస్తువులను దూరంగా పెట్టడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: