వంటింట్లో దొరికే ఈ లవంగాలు పోషకాలపుట్ట..!!

Divya
చాలా మంది ఈ మధ్యకాలంలో డయాబెటిస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే ఈ డయాబెటిస్ కు సైతం చెక్ పెట్టుకోవచ్చు.. దగ్గు, జలుబు సమస్యతో ఇబ్బంది పడే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.. మన ఇంట్లో ఉండేటువంటి లవంగం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. విపరీతమైనటువంటి దగ్గుతో బాధపడేవారు ఈ లవంగాలను తినడం వల్ల ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి.. పంటి నొప్పితో ఇబ్బంది పడే వారికి కూడా ఈ లవంగం చాలా రిలీఫ్న సైతం అందిస్తుంది. రాత్రిపూట పడుకునే సమయంలో లవంగం టీ తాగడం వల్ల సుగర్ లెవెల్స్ కూడా చాలా అదుపులో ఉంటాయట.

లవంగాలు రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని సైతం తగ్గించడమే కాకుండా ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా లవంగంలో ఉండేటువంటి పోషకాలు అందిస్తాయి.. డయాబెటిస్తే బాధపడుతున్నవారు. ప్రతిరోజు రాత్రి రెండు లవంగాలను నోట్లో వేసుకొని పడుకోవడం వల్ల షుగర్ సైతం నియంత్రణలో ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.. లవంగాల వల్ల నొప్పి నియంత్రణే కాకుండా జీర్ణ ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. లవంగాలు మనం డైట్లో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ నుంచైనా సరే బయటపడవచ్చు.

లవంగాలు డయాబెటిస్తే బాధపడేవారు ఆహారంలో చేర్చుకుంటే ఇది ఒక సహజమైన ఇన్సులిన్ గా కూడా ఉపయోగపడుతుంది. లవంగాలు క్రిమినాశక గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.అందుకే లవంగాలను ప్రతి ఒక్కరు కూడా తమ డైట్లో చేర్చుకోవడం ముఖ్యమని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు.. లవంగాలలో కాల్షియం, ఐరన్, సోడియం, కార్బోహైడ్రేట్లు విటమిన్-A, మాంగనీస్ వంటి పోషకాలు కూడా చాలా పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి చాలా ఉపయోగపడతాయి.. ముఖ్యంగా మూడు పూటల భోజనం తిన్న తర్వాత లవంగాలను తీసుకుంటే పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. లోపల ప్రేగులను సైతం శుభ్రపరిచే విధంగా అందులో ఉండే సూక్ష్మజీవులను హాని కలిగించే క్రిముల నుండి మన శరీరాన్ని రక్షిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: