ఇవి తింటే చెడు కొలెస్ట్రాల్ పరార్ అవుతుంది?

Purushottham Vinay
చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు సోయా వాడడం మంచిది. వీటిలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే రోజు వారి ఆహారంలో భాగంగా బీన్స్, చిక్కుళ్లు, రాజ్మా వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.ఆహారంలో భాగంగా చేపలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. చేపలల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆలివ్ నూనె మనకు ఎంతో సహాయపడుతుంది. అదే విధంగా మన రోజు వారి ఆహారంలో భాగంగా అవకాడోను తీసుకోవడం వల్ల కూడా మనం కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.చెడు కలెస్ట్రాల్ ను తగ్గించడంలో వెల్లుల్లి మనకు ఎంతగానో సహాయపడుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదపడుతుంది. 


వంటల్లో ఆలివ్ నూనెను వాడడం వల్ల కూడా మనం చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఈ నూనెలో మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.బచ్చలికూర, తోటకూర వంటి ఆకుకూరలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలను రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇక బెర్రీ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.రోజూ ఆహారంలో భాగంగా ఓట్స్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఓట్స్ లో బీటా గ్లూకాన్ పుష్కలంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: