ఈ పువ్వుతో అనేక సమస్యలు మాయం?

Purushottham Vinay
సాధారణంగా చాలా మంది మహిళలు బహిష్టు సమయంలో చాలా ఎక్కువ రక్తస్రావంతో ఇబ్బంది పడుతుంటారు. బహిష్టు రక్తస్రావం సాధారణమైనప్పటికీ, అధిక రక్తస్రావం మాత్రం చాలా అనారోగ్యకరం. మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే, నాగకేసరి పువ్వుని  ఖచ్చితంగా ఉపయోగించండి. ఇందుకోసం 500 మి.గ్రా. నాగకేసరి పొడిని పాలవిరుగుడుతో కలిపి మూడు రోజులపాటు తినాలి. ఇది కాకుండా మీ రోజువారీ ఆహారంలో మజ్జిగ తీసుకోండి. ఇలా చేయడం వల్ల మెనోరేజియా సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.నాగకేసరి పువ్వుల పొడిని తేనెతో కలిపి తింటే జ్వరం కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. పావు టీస్పూన్ తేనెను అర టీస్పూన్ పొడితో కలిపి తీసుకోవాలి. దీన్ని రోజుకు 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. నాగకేసర పువ్వుల పొడిని తేనెతో కలిపి తీసుకుంటుంటే పైల్స్‌, ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయి. ఆ మిశ్రమాన్ని రోజుకు 1 లేదా 2 సార్లు తీసుకోవాలి. నాగకేసర నూనెను గాయాలు, పుండ్లపై రాస్తుంటే అవి త్వరగా మానుతాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ నాగకేసర పువ్వుల పొడిని కలిపి తాగితే తలనొప్పి తగ్గుతుంది.


ప్రస్తుత కాలంలో చాలా మందికి 30ఏళ్లు కూడా దాటకుండానే కీళ్ల నొప్పుల సమస్య కూడా సర్వసాధారణమైపోతోంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే నాగకేసర్ చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. దీని కోసం, నాగకేసర గింజల నూనెను కీళ్లపై లేదా నొప్పి ఉన్న ప్రదేశాలపై నెమ్మదిగా మర్ధన చేయాలి.. ఇది నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.దీంతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి.నాగకేసర పువ్వుల పొడితో ఆగకుండా వస్తున్న వెక్కిళ్లను తగ్గించుకోవచ్చు. అందుకు గాను ఆ పువ్వుల పొడిని తేనెతో కలిపి తీసుకోవాలి. అదే పొడిని చెరుకు రసంతో కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో వెక్కిళ్లు తగ్గిపోతాయి.ప్రస్తుతం కడుపు సంబంధిత సమస్యలు సర్వసాధారణం. అజీర్ణం, అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్, కడుపునొప్పి, వాపు వంటి సమస్యలను అధిగమించడానికి నాగకేసర్ వాడితే ఉపశమనం కలుగుతుంది. . దీని కోసం, మీరు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నాగకేసర పువ్వులతో తయారు చేసిన పొడి, తేనె కలిపి తీసుకుంటే, అజీర్ణం, అసిడిటీ, గ్యాస్, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: