భూమి నుండి 30 కిలోమీటర్ల ఎత్తులో భోజనం.. వామ్మో?

praveen
సాధారణంగా నేటి సమాజంలో జనాలు ఎక్కువగా రొటీన్ లైఫ్ కి అలవాటు పడిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఏకంగా అడ్వెంచర్స్ తో నిండిపోయిన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలాంటి అడ్వెంచర్స్ చేయడానికి ఎప్పుడూ ముందడుగు వేస్తూ ఉంటారు. అయితే ఇలా అడ్వెంచర్స్ లైఫ్ ను కావాలి అనుకునే ఎంతో మంది కోసం ఇక ఎన్నో కంపెనీలు ఎన్నో రకాల సేవలను అందిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి థ్రిల్లింగ్ అడ్వెంచర్స్  విషయం గురించే.

 సాదరణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లోనో లేదంటే బయట ఉన్న హోటల్ లోను భోజనం చేయడం చేస్తూ ఉంటారు. కానీ ఇలా రొటీన్ గా కాకుండా గాల్లో తేలుతూ భోజనం చేస్తే ఎలా ఉంటుంది. అది కూడా భూమికి 30 కిలోమీటర్ల ఎత్తులో ఏకంగా సూర్యోదయాన్ని చూస్తూ భోజనం చేయడం అంటే అబ్బో మాట్లాడుకోవడానికి ఎంతో థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది కదా. అలాంటిది ఇక ఇలాంటి అడ్వెంచర్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతూ ఉంటుంది. అది సరేగాని ఇలా కేవలం భోజనం చేయడం కోసమే ఇలాంటి థ్రిల్లింగ్ అడ్వెంచర్ ని ఎవరు చేస్తారు అని అంటారా? ఇందుకోసం ఒక సంస్థ ప్రత్యేకమైన ప్యాకేజీని ఇస్తుంది.

 యూఎస్ కు చెందిన spaceVIP అనే ప్రైవేట్ స్పేస్ టూరిజం సంస్థ దీన్ని వచ్చే ఏడాది నిజం చేయబోతుంది అని చెప్పాలి. ప్రపంచంలోనే తొలి కార్బన్ న్యూట్రల్ స్పేస్ క్యాప్సూల్ ద్వారా లక్ష అడుగులు అంటే దాదాపుగా 30 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్తారు. అక్కడ భోజనం చేస్తూ సన్ రైస్ ని చూడొచ్చు. అంతేకాదు భూమి మీద ఉన్న వారితో వీడియో కాల్ కూడా మాట్లాడొచ్చు. వావ్.. ఇదేదో బాగుంది కదా మేం కూడా ఇది ఒకసారి ట్రై చేస్తాం అని అనుకుంటున్నారు కదా. అలా తొందరపడకండి. ఎందుకంటే ఇలా చేయాలి అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఏకంగా ఈ అడ్వెంచర్ చేయడానికి  ఒక్కో వ్యక్తి దగ్గర ఏకంగా నాలుగు కోట్ల ఫీజు వసూలు చేస్తుంది సదరు ప్రైవేట్ టూరిజం సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: