పింక్ పైనాపిల్ గురించి ఈ విషయాలు తెలుసా..?

Divya
మనం సాధారణంగా పైనాపిల్ అంటే లోపల ఎల్లో కలర్ గా పండు మాగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది.కానీ పింక్ పైన ఆపిల్ అనేది ఒక అరుదైన పండు.. ఇది సాధారణ పైనాపిల్ కంటే చాలా అరుదుగా లభిస్తుంది.. గులాబీ లేదా పసుపు రంగు గుజ్జులో ఈ పైనాపిల్ పండు ఉంటుంది.ఈ రంగు లైకోపీన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ కారణంగా మారుతుందట. ఈ పింక్ పైన ఆపిల్ ఎక్కువగా హవాయి మెక్సికో కెన్యా ఇతరత్ర ప్రాంతాలతో పాటు ఇండియాలో కూడా చిన్న మొత్తంలో ఈ పండు పండుతోందట.

ఇంకు పైన ఆపిల్ ఇండియాలో అస్సాం ,కేరళ ,త్రిపుర బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాలలో పండిస్తున్నారు. అయితే ఈ పింక్ పైనాపిల్ సాధారణ పైనాపిల్ కంటే ఎక్కువ పోషకాలను సైతం కలిగి ఉంటుందట. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని సైతం పెంచడానికి ఉపయోగపడుతుంది.. ఇందులో ఉండేటువంటి మాంగనీస్ ఎముకల ఆరోగ్యానికి శక్తిని ఇవ్వడానికి సైతం ఉపయోగపడుతుందట. అలాగే ఈ పింక్ పైనాపిల్ జీర్ణ క్రియను కూడా మెరుగుపరిచేలా చేస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఈ పింకు పైనాపిల్ యాంటీ ఆక్సిడెంట్లు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. వీటివల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నిరోధించడానికి సహాయపడుతుందని పరిశోధకులు సైతం తెలియజేస్తున్నారు.

పింకు పైన ఆపిల్ రక్తపోటును తగ్గించడానికి అలాగే గుండె జబ్బుల నుంచి తగ్గించడానికి సహాయపడుతుంది.
పింకు పైన పిల్లో విటమిన్-c వంటివి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు ఫ్లూ వంటి అంటూ వ్యాధులను కూడా రాకుండా చేస్తుంది.

అయితే పింక్ పైన పిల్ అందరూ తినడం మంచిది కాదట. డయాబెటిస్ లేదా రక్తస్రావం రుగ్మత ఉంటే పింక్ పైనాపిల్ తినే ముందు వైద్యుల్ని కచ్చితంగా సంప్రదించడం మంచిది. అధికంగా పింక్ పైనాపిల్ తినడం వల్ల వాంతులు వికారం వంటి దుష్ప్రభావాలు కూడా కలిగించేలా చేస్తుందట. పింకు పైనాపిల్ అనేది మామూలు పైనాపిల్ క్రాస్ నుంచి వస్తుందట. అందుకే దీనిని బ్రోమెలియోడ్ రాణి అని పిలుస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: