వెరైటీ వెడ్డింగ్ కార్డు.. భూమిలో పాతితే మొలకలు వస్తాయట?

praveen
పర్యావరణ పరిరక్షణ కోసం ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అను విషయం తెలిసిందే. కొంతమంది అందరిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు  ఇంకొందరు పక్క వాళ్ళు  ఏం చేసినా పరవాలేదు తమవంతుగా పర్యావరణాన్ని రక్షించడం  కోసం ఏదో చేయాలి అని ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు ఎలక్ట్రికల్ వాహనాలు ఉపయోగించడం ద్వారా వాయు కాలుష్యం తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

 ఇంకొంతమంది ఏకంగా చెట్లను నాటుతూ పచ్చడి ప్రకృతిని పెంపొందిస్తూ పర్యావరణాన్ని కాపాడాలని అనుకుంటూ ఉంటారు  ఇలా ఒక్కొక్కరు ఒక విధంగా పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ ఉంటారు  అయితే కొంతమంది పర్యావరణ రక్షణ కోసం చేసే ఆలోచన మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది  ఇంత క్రియేటివిటీ తో కూడుకున్న ఆలోచన అసలు ఎలా వచ్చిందో అని అనిపిస్తూ ఉంటుంది  అయితే ఇక ఇప్పుడు ఒక మహిళకు వచ్చిన ఆలోచన కూడా ఇలాగే అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా కూతురు పెళ్లి ఉంది అంటే ఏకంగా తమ తాహతుకు తగ్గట్లుగా వెడ్డింగ్ కార్డును రెడీ చేసుకోవడం చేస్తూ ఉంటారు అందరూ. ఈ క్రమంలోనే నచ్చిన డిజైన్ ఎంచుకుంటూ ఉంటారు.

 వెడ్డింగ్ కార్డులోనే తమ స్టేటస్ కనిపించాలని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు  అయితే ఆదిలాబాద్ కు చెందిన స్కూల్ ప్రిన్సిపల్ స్వర్ణలత మాత్రం ఇక వెడ్డింగ్ కార్డు విషయంలో వినూత్నమైన ఆలోచన చేసింది. కూతురు వైష్ణవి పెళ్ళికి ఆహ్వాన పత్రికలను తయారు చేయించింది. అయితే వీటిలో తులసి, బంతి, చామంతి విత్తనాలు ఉంటాయి. ఈ పత్రికను రెండు గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత మట్టిలో పూడ్చితే ఏకంగా మొలకలు కూడా వస్తాయట. కొత్త మొక్కలకు జీవం పోయాలి అనే ఉద్దేశంతో వీటిని తయారు చేయించినట్లు ప్రిన్సిపల్ స్వర్ణాలతా చెప్పుకొచ్చారు. వీటితోపాటు కూరగాయల విత్తనాలతో ఉన్న పెన్నులను కూడా ఆమె పంచుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: