కోడిగుడ్డుతో టేస్టీ అండ్ హెల్తీ వంటకం ఇదే?

Purushottham Vinay
కోడిగుడ్డు తో ఎన్నో కూరలు ఫ్రైలు చేసుకుని తింటూ ఉంటాము. రోజుకు ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు.ఎప్పుడు ఒకేలా కాకుండా ఇవాళ కొంచెం డిఫరెంట్ గా చేసుకుందాం.కోడిగుడ్డు ఫ్రై,కోడిగుడ్డు పులుసు ఇలా రొటీన్ గా కాకుండా ఆవిరి మీద ఉడకబెట్టిన ఎగ్ కర్రీ ని ఎలా చేసుకోవాలో ఇవాళ తెలుసుకుందాం.ఒక గిన్నెలో ఒక స్పూన్ కారం,కొంచం ఉప్పు, ఒక స్పూన్ దానిలాయ పొడి వేసి దీనిలోనే కొంచెం వాటర్ పోసుకుని మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో ఆరు లేదా ఏడు కోడిగుడ్లని పగలగొట్టి అందులో సోనని వేసుకొని బాగా కలపాలి.ఇప్పుడు మరో గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి.దానిలో చిన్న స్టాండ్ లాంటిది పెట్టుకోవాలి.ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని దానికి మొత్తం ఆయిల్ రాసి ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని దీనిలోకి షిఫ్ట్ చేసుకోవాలి.తర్వాత స్టాండ్ పై పెట్టి మూత పెట్టాలి.ఇలా సన్నని మంట మీద అరగంట సేపు వాటర్ మరిగే వరకు ఆవిరి పైనా ఉడికించుకోవాలి.


తర్వాత స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కాగాక జీలకర్ర ఆవాలు వేసి చిటపట లాడాక అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ ధనియాలు పొడి వేసి వేగనివ్వాలి.కొంచం వేగాక అల్లంవెల్లులి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గనివ్వాలి.తర్వాత చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి మరో రెండు నిముషాలు ఉడికించాలి.ఇప్పుడు ముందుగా అవరి మీద ఉడికించుకున్న ఎగ్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకువాలి. ముక్కలని కలుపుతూ సన్నని మంటపై రెండు మూడు నిముషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీరా చల్లుకొని సర్వ్ చేసుకొండి అంతే ఆవిరి మీద ఉడికించిన ఎగ్ కర్రీ రెడీ.చూడటానికి అచ్చం చికెన్ కర్రీ లా ఉంటుంది.టేస్ట్ కూడా అదిరిపోతుంది.మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అదిరిపోయే రుచిని అస్వాదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: