ఇడ్లీతో హెల్తీ అండ్ టేస్టీ వంటకం?

Purushottham Vinay
మనకు ఉదయాన్నే బ్రేకఫాస్ట్ అనగానే వెంటనే గుర్తొచ్చేది ఇడ్లీ, దోస,కొంతమంది వీటిని ఇష్టంగా తింటారు.మరికొంతమంది తక్కువ ఇష్టపడతారు.ఎప్పుడు ఒకే రకమైనా ఇడ్లీ లు చేయడం వల్ల పిల్లలకి వీటిపై ఇంటరెస్ట్ పోతుంది.అయితే ఎప్పుడూ ఒకేరకమైన ఇడ్లీ లు కాకుండా అదే ఇడ్లీలతో కొంచెం వెరైటీ గా చేసుకొని తినటం వళ్ళ కొత్తగా ఉంటుంది.మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఇలా చేసి పెట్టమని అడుగుతారు.మరీ ఈ ఇడ్లీలతో ఆ వెరైటీస్ ఏంటో చూద్దాం.ముందుగా రెడీ చేసిపెట్టుకున్న ఇడ్లీ లని ఒక ఐదు ఆరు తీసుకోండి వీటిని మరీ సన్నగా కాకుండ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి.తర్వాత ఒక పాన్లో ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అందులో లేత కరివేపాకు వేసి అందులోనే ఇడ్లీ కారాన్ని వేసుకోవాలి.కారం కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలని ఇందులో వేయాలి.ఇలా వేసిన ఇడ్లీ ముక్కలకి కారం బాగా పట్టేలా రెండు నిముషాలు పాటు వేగనివ్వాలి అంతే సర్వ్ చేసుకొని తినవచ్చు.చాలా రుచిగా ఉంటుంది.ఇంతే కాదు ఈ ఇడ్లీ తో ఉప్మా కూడా చేసుకోవచ్చు ఎలా అంటారా చూసేద్దాం రండి.


ఒక ఆరు ఏడు ఇడ్లీలని మెత్తగా మెదిపుకుని రవ్వలా చేసి పక్కన పెట్టుకువాలి.తర్వాత ఉప్మా ప్రిపేర్ చేసుకొనే కలాయిలో రెండు టేబుల్ స్ఫూన్స్ ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసి లేత కరివేపాకు వేసుకుని చిటపటలాడాక,అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక టమోట ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి.రెండు నిముషాలు తర్వాత  ఒక స్పూన్ సాల్ట్,హాఫ్ స్పూన్ పసుపు వేసి ఇంకో నిముషం మగ్గనివాలి.తరువాత ముందుగా పొడి చేసుకున్న ఇడ్లీలని ఇందులో వేయాలి. బాగా కలిపి ఒక నాలుగు నిముషాలు సన్నని మంటపై బాగా మగ్గనివ్వాలి. అంతే ఎంతో రుచుకరమైన ఇడ్లీ తో చేసిన ఉప్మా రెడీ. ఈ ఉప్మాని పల్లీ చట్నీ తో తింటుంటే అబ్బో అద్భుతంగా ఉంటుంది.ఇలా చేయడం వల్ల కొత్తగా ఉంటుంది.పిల్లలు ఇష్టంగా తింటారు. అరుగుదల కూడా బాగా అవుతుంది.అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి.వీటిని ఇలా చేసుకోవడం చాలా ఈజీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: