మటన్ ఇలా చేస్తే రుచికి రుచి.. ఆరోగ్యం కూడా?

Purushottham Vinay
కొందరికి సండే వస్తే చాలు తప్పకుండా నాన్వెజ్ ఉండాల్సిందే. మటన్,చికెన్,ఫిష్ ఇలా ఎదో ఒకటి తప్పనిసరి.చికెన్ కన్నా మటన్ రేట్ ఎక్కువ అయినా హెల్త్ కి ఇదే మంచిది.చికెన్ ఎక్కువగా తింటే వేడి చేస్తుందని చెప్తుంటారు.కానీ మటన్ తింటే చలువ చేస్తుందని ఇంకొందరు చెప్తున్నారు.మటన్లో ఐరన్,విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి.మటన్ తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది,శరీరంలో వేడిని తగ్గిస్తుంది,ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల,ఎముకలు పళ్ళు దృఢంగా ఉంటాయి.తరచూ మటన్ తినడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీ గా కూడా చేసుకుని తింటూ ఉండాలి.కాబట్టి మటన్ ప్రియులకి ఇవాళ కొత్త రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం.


మామూలుగానే మటన్ కర్రీ అదిరిపోతుంది.కానీ మసాలా పెట్టి చేస్తే మతి పోతుంది.అంత రుచిగా ఉంటుంది.మరి ఆ మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం.ముందుగా చిన్నగా కొట్టించుకున్న మటన్ ముక్కలని శుభ్రంగా కడగాలి.తర్వాత కడిగిన మటన్ ని కుక్కర్ లో వేసి ఉప్పు,పసుపు,కారం,దాల్చిన చెక్క,లవంగం,యాలకులు,వేసి అల్లంవెల్లులి పేస్ట్ వేసి ముక్క మునిగే వరకు నీళ్లు పొసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.తర్వాత కడాయిలో నూనె పోసి వేడి అయ్యాక సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా రంగు మారే వరకు వేగించుకోవాలి.తర్వాత అందులోనే కొంచెం ఉప్పు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి.


ఈలోపు ఉడికించుకున్న మటన్ ముక్కలని నీళ్లతో పాటు ఇందులో వేసి నీళ్లు మొత్తం పోయి నూనే పైకి తేలే వరకు ఇగరబెట్టుకోవాలి.తర్వాత అందులోనే ఐదు పచ్చిమిర్చి ముక్కలు,గుప్పెడు కరివేపాకు,గరం మసాల,ధనియాల పొడి,జీలకర్ర పొడి,కారం వేసి నూనే పైకి తేలేవరకు ఉడికించుకోవాలి.చివరిలో కొత్తిమీర చల్లుకోవాలి అంతే వేడి వేడి మటన్ కర్రీ రెడీ.వేడి వేడి రైస్ లో కర్రీ వేసుకొని తింటుంటే అబ్బో ఆ రుచే వేరు.రైస్ లొకే కాదు,చపాతీ,పూరీ,రాగిసంగటి,ఇలా దేంతో తిన్న రుచి అదిరిపోతుంది.ఇంకెందుకు ఆలస్య మీరు కూడా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: