పిల్లలు టీవీ.. స్మార్ట్ మొబైల్ చూస్తూ తింటున్నారా.. అయితే ప్రమాదమే..!!

Divya
ప్రస్తుతం ఉన్న రోజుల్లో పిల్లలు ఎక్కువగా టీవీలు చూస్తూ స్మార్ట్ మొబైల్స్ ని చూస్తూ భోజనాలు తినడమే కాకుండా ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో టీవీ మొబైల్ లేనిదే భోజనం కూడా పిల్లలు తినని పరిస్థితి ఉన్నది. అయితే ఇలా చేయడం వల్ల చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్టుగా నిపుణులు తెలియజేస్తున్నారు. టీవీలు చూస్తూ మొబైల్ చూస్తూ స్నాక్స్ తినడం వల్ల పిల్లలలో మధుమేహం ఎక్కువగా వస్తుందని ఒక పరిశోధనలో వైద్యుల సైతం తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా పిల్లల్లో పెరుగుతున్న అధిక బరువు వోత్తిడి వల్ల టైప్-1 డయాబెటిస్ కు కారణమవుతోందట. దీనివల్ల పిల్లలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు.భోజన సమయంలో సమతుల్య ఆహారాన్ని అందించడం ముఖ్యము మొబైల్ టీవీ చూడడం వల్ల ఎక్కువ ఆహారాన్ని పిల్లలు తినేస్తున్నారట. మధుమేహంతో సహా అనేక శారీరక సమస్యలకు కూడా కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లలకు తినేటప్పుడు మొబైల్ టీవీ చూడడం వంటివి అలవాటును తగ్గించేందుకే తల్లితండ్రులు ఎక్కువ ప్రయత్నాలు చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిల్లలు భోజన నియమాలను కచ్చితంగా పాటించేల నిర్ణయాలు తీసుకోవాలని అలాగే ఆహారం పట్ల ఆసక్తి కలిగించడానికి పిల్లలకు కావలసిన రీతిలో భోజనం తయారు చేయించేలా చేసుకోవాలి స్నాక్స్ ఎంచుకోవడం లేదా భోజనం తయారీలో పోషకాలు ఉండే విధంగా తయారు చేసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి భోజనం చేయడం వల్ల పిల్లలకు మానసికంగా శారీరకంగా కూడా చాలా మేలు జరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగా పిల్లలలో ఆరోగ్యంగా ఉండడానికి ఇలాంటి అలవాట్లు చాలా సహాయపడతాయి. భోజన సమయంలో టీవీ లేకుండా అందరితో పాటు కూర్చొని తినడంతో పిల్లలు కూడా చాలా తెలివిగా ఉంటారని నిపుణులు ఒక పరిశోధనలో తెలియజేస్తున్నారు. సాయంత్రం పూట ఆడుకోవడానికి బయటకి పంపించడం వల్ల కూడా చాలా ఎనర్జీటీగా ఉంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: