సంజీవని వంటి గింజలను ఎప్పుడైనా తిన్నారా..?

Divya
మన చుట్టూ మనకు తెలియకుండానే ఎన్నో రకాల గింజలు సైతం మన ఆరోగ్యానికి మేలు చేస్తూ ఉంటాయి.. ముఖ్యంగా ఈ గింజలను అవిసెగింజలను కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గింజలు ఏకంగా సంజీవని కంటే ఎక్కువ మేలు చేస్తాయని కూడా మన పూర్వీకులు నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు నెలసరి క్రమం తప్పకుండా ఈ అవిసెగింజలను ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది. మహిళలకు ఎంతో ఉపయోగకరమైన గింజలుగా ఇవి ఉంటాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రొమ్ము క్యాన్సర్ ని సైతం నిర్మూలించే పోషకాలు కూడా కలవు
ఒమేగా త్రీ వంటి ఆమ్లాలు కూడా కలిగి ఉంటాయి. అవిసె గింజలలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండడం వల్ల జీర్ణ క్రియను కూడా వేగవంతంగా చేస్తాయి.
కండరాలు ఆరోగ్యంగా ఉండాలన్న నొప్పులు ఉండ కూడదనుకున్న తగినంత ప్రోటీన్స్ కావాలనుకుంటే కచ్చితంగా ఈ అవిసెగింజలను సైతం ఎక్కువ మోతాదులో ఉపయోగించుకోవాలి.
 అవిసె గింజలు కొంచెం తిన్నా సరే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం వంటిది. ఇవి రక్తపోటును కూడా తగ్గిస్తాయి చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి.

ఎవరైతే చేపలు తినకుండా ఉంటారో వారికి ఇందు లో ఉండే ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.ఇవి గుండెకు కూడా మేలు చేస్తాయి.
అవిసె గింజలలో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఫైబర్ విటమిన్ B-1,B-6 ఐరన్ మెగ్నీషియం వంటి ఆమ్లాలు ఐరన్ మెగ్నీషియం వంటివీ లభిస్తాయి.
అవిసె గింజలు హార్మోన్ల సమతుల్యతను కూడా లేకుండా చేస్తాయి. అయితే అలర్జీ థైరాయిడ్ గ్యాస్ సమస్యలు గర్భిణీలు సైతం వీటికి దూరంగా ఉండడమే మంచిదంటూ వైద్యులు తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందు లో సైనోజెన్ అనే రసాయనం ఉంటుంది. ఇది చాలా ప్రమాదానికి గురయ్యేలా చేస్తుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ఎవరైతే వీటిని తింటారా ఆరోగ్యంగా కూడా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: